రష్మికతో ప్రేమయాణంలో విజయ్‌ దేవరకొండ!

యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ గత కొంత కాలంగా నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. సినిమాలతో పాటు వ్యక్తిగత విషయాలతోనూ ట్రెండ్‌ అవుతున్నారు. రష్మిక మందన్న, విజయ్‌ దేవరకొండ ప్రేమాయణం గురించి బాగా వార్తలు వినిపిస్తున్నాయి. రష్మిక కొంత కాలంగా విజయ్‌ ఇంట్లోనే ఉంటుందనే టాక్‌ నడుస్తోంది.

విజయ్‌, రష్మిక పెట్టే ఫోటోలను నెటిజన్లు బూతద్దం వేసి మరీ వెతుకుతున్నారు. ఏదైనా కొత్త విషయం దొరకకపోదా అని ఆరా తీస్తున్నారు. ‘పెళ్లి చూపులు’ సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయం అయిన విజయ్‌, ‘అర్జున్‌ రెడ్డి’ సినిమాతో బాగా పాపులర్‌ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన ‘గీత గోవిందం’ సినిమా కూడా సంచనల విజయం సాధించడంతో ఆయన కెరీర్‌ మరింత స్వింగ్‌ లోకి వచ్చింది.

‘టాక్సీ వాలా’ ఫర్వాలేదు అనిపించినా, పూరి జగన్నాథ్‌ పాన్‌ ఇండియా రేంజిలో తెరకెక్కించి ‘లైగర్‌’ సినిమా మాత్రం బాక్సాఫీస్‌ దగ్గర డిజాస్టర్‌ గా మిగిలింది. విజయ్‌ కెరీర్‌ కే పెద్ద మచ్చగా మిగిలిపోయింది. తాజాగా ఆయన నటించి ‘ఖుషి’ సినిమా కూడా ప్రేక్షకులను అంతంత మాత్రంగానే ఆకట్టుకుంది. ప్రస్తుతం ‘ఫ్యామిలీ స్టార్‌’ అనే సినిమా చేస్తున్నారు.