Atlee: టాలీవుడ్ హీరో అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతున్న విషయం మనందరికి తెలిసిందే. బన్నీ పుష్ప 2 సినిమా తర్వాత తమిళ దర్శకుడు అట్లీతో సినిమా చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ గురించి ఇది వరకే రెండు వీడియోలు రిలీజ్ చేశారు. ఈ వీడియోస్ ఇప్పటికే మూవీపై భారీగా అంచనాలు నెల కొన్నాయి. అలాగే ఈ సినిమాకు సంబంధించి వినిపించిన వార్తలు సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈ సినిమా షూటింగ్ ఇంకా మొదలు కాకముందే ఈ మూవీపై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది.
ఇది ఇలా ఉంటే ఈ సినిమా గురించి అట్లీ చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సందర్బంగా అట్లీ మాట్లాడుతూ.. దేశంలోనే ఇదే ఖరీదైన సినిమా.. చాలా పెద్దగా ప్లాన్ చేస్తున్నము. సరికొత్త టెక్నాలజీ కూడా పరిచయం చేయబోతున్నాము. బడ్జెట్ ఎంతనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. సినిమా తీయడం వరకే నా బాధ్యత. విడుదల ఎప్పుడనేది నిర్మాత తీసుకునే నిర్ణయం బట్టి ఉంటుంది అని అట్లీ చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అయితే అట్లీ చెప్పిన దాని బట్టి చూస్తుంటే హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దేశంలోనే ఖరీదైన సినిమా అంటూ అట్లీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేసాయి. దీన్ని బట్టి ఈ సినిమాను ఏ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు అర్థం చేసుకోవచ్చు. అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా మారిన తర్వాత రాబోతున్న సినిమా కావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. దానికి తోడు ఈ సినిమాకు అట్లీ దర్శకత్వం వహిస్తుండడంతో ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతో ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు.