బిగ్ బాస్ షో గురించి, దానికున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బిగ్ బాస్ షో నడిచినంత కాలం దానిదే హవా. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన షో హైలెట్స్ కనిపిస్తుంటాయి. మీమ్స్, ట్రోల్స్ చేసే వారికి చేతినిండా పని ఉంటుంది. వాటిని ఎంజాయ్ చేసే బ్యాచ్ కూడా సపరేట్‌గా ఉంటుంది. కంటెస్టెంట్ల పేరు మీద ఫ్యాన్ పేజీలు, ఆర్మీలు, ఎదుటి కంటెస్టెంట్ల మీద ట్రోలింగ్, కంటెస్టెంట్ల ఇంటర్వ్యూలు ఇలా ప్రతీ ఒక్కటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.
అలా బిగ్ బాస్ షో అంటే ఓ క్రేజ్ ఉంటుంది. బిగ్ బాస్ సీజన్ వస్తుందంటే కొందరిలో ఉత్సాహం ఉరకలెత్తుతూ ఉంటుంది. తమ ఫేవరేట్ కంటెస్టెంట్లకు ఓట్లు వేయాలని ఎంతో మంది తాపత్రయపడుతుంటారు. పైగా వారి ఫోన్ల నుంచే కాకుండా పక్క వారి ఫోన్లు కొట్టేసి మరీ ఓట్లు వేస్తుంటారు. తాజాగా అలాంటి ఓ ఘటన తనీష్ ఇంట్లో జరిగిందట. తనీష్ తాజాగా ఓ ఫన్నీ వీడియోను షేర్ చేశాడు. తన తమ్ముడు అమ్మ ఫోన్ లాక్కుని మరీ ఓట్లు వేసేశాడట.
దీనిపై తనీష్ తల్లి వాపోయింది. అవి దొంగ ఓట్లు.. తన ఫోన్‌లో తాను వేయాలనుకున్న ఓట్లను వాడు వేసేశాడంటూ చెప్పుకొచ్చింది. అయినా కూడా ఇంకా హాట్ స్టార్‌లో ఓట్లు వేసేందుకు ట్రై చేస్తూనే ఉంది. ఒకసారి వేస్తే మళ్లీ పడవు అంటూ తనీష్ తన తల్లికి చెప్పినా వినలేదు. మళ్లీ వస్తాయేమో అని ట్రై చేస్తున్నా అని చెప్పుకొచ్చింది. మొత్తానికి బిగ్ బాస్ క్రేజ్ ఇలా ఉందంటూ తనీష్ ఓ చిన్న ఉదాహరణ చూపించాడు. మొత్తానికి ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. అనధికారిక సమాచారం ప్రకారం అభిజిత్ అందరికీ అందనంత దూరంలో ఉన్నాడట.
https://www.instagram.com/stories/tanishalladi/2467042524508514751/