ఇంకా అలానే ఉన్నారు.. సునీల్‌పై తనీష్ ఫన్నీ కామెంట్స్

Tanish about Sunil In Manmadhudu movie

తనీష్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాల్లో నటించాడన్న సంగతి తెలిసిందే. అలా చైల్డ్ ఆర్టిస్ట్‌గా తనీష్ చేసిన సినిమాల్లో మన్మథుడు సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆ సినిమాలో తనీష్ సోనాలి బింద్రేకు తమ్ముడి పాత్రలో నటించాడు. ఆ క్యారెక్టర్, సునీల్ బంకు శీను పాత్రలకు మధ్యవచ్చే కామెడీ సీన్స్ ఇప్పటికీ ఫేమస్సే. యూట్యూబ్‌లో ఆ సీన్లకు సపరేట్ ఫాలోయింగ్ కూడా ఉంటుంది.

Tanish about Sunil In Manmadhudu movie
Tanish about Sunil In Manmadhudu movie

అయితే తాజాగా తనీష్ నాటి రోజులను గుర్తుకు చేసుకున్నాడు. మన్మథుడు సినిమా వచ్చి 19 ఏళ్లు అవుతుందంటూ నాటి పోస్టర్‌ను, తమ ఇద్దరి మధ్యలో వచ్చే సీన్‌ను తనీష్ గుర్తు చేసుకుంటూ సునీల్ మీద కామెంట్ చేశాడు. నిన్న తనీష్, సునీల్ ఓ సినిమా ఈవెంట్ కోసం వెళ్లారు. అక్కడ ఇద్దరూ కలిసి మాట్లాడుకున్నారు. అలా ఇప్పుడు ముచ్చట్లు పెట్టుకున్న ఫోటోను, నాటి ఫోటోను షేర్ చేస్తూ తనీష్ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

మన్మథుడు సినిమా వచ్చి 19 ఏళ్లు అవుతోంది.. పై ఫోటో నుంచి కింది ఫోటో వరకు పందొమ్మిదేళ్లు గడిచిపోయాయి.. కానీ ఆయన మాత్రం నాతో అంతే స్వీట్‌గా అంతే ప్రేమగా ఉన్నాడు.. లవ్యూ అన్నయ్య అంటూ సునీల్ మీద తనీష్ తన ప్రేమను చూపించాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు, తనీష్ చేసిన కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి. తనీష్ మహాప్రస్థానం సినిమాతో మళ్లీ హీరోగా నిరూపించుకోవాలని ప్రయత్నిస్తున్నాడు.