లీక్ : రోలెక్స్..వాడి పేరు “ఓజి”..!

టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాస్ క్రేజ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమాల్లో తన మరో ఫ్యాన్ దర్శకుడు సుజీత్ తో తెరకెక్కిస్తున్న తన పొటెన్షియల్ కి తగ్గ సాలిడ్ చిత్రమే “ఓజి” పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి తగ్గ సరైన సినిమాగా ఇది వస్తుండగా సుజీత్ అయితే దీనిని నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నాడు.

దీనితో పవన్ కూడా ఇంట్రెస్టింగ్ ఈ సినిమాకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉండడం ఫ్యాన్స్ లో కూడా ఆసక్తిగా మారింది. ఇక కంప్లీట్ ఏక్షన్ బ్లాక్ లతోనే తెరకెక్కుతున్న ఈ చిత్రంపై లేటెస్ట్ గా వచ్చిన ఓ లీక్ తో ఐతే పవన్ ఫ్యాన్స్ నెక్స్ట్ లెవెల్లో ఎగ్జైట్మెంట్ ని ఫీల్ అవుతున్నారు.

కాగా ఈ చిత్రంలో అయితే లేటెస్ట్ గా “విక్రమ్” ఫేమ్ కోలీవుడ్ యువ నటుడు అర్జున్ దాస్ కూడా నటిస్తున్నట్టుగా కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా ఈ నటుడు తన వాయిస్ తో బాగా ఫేమస్. మెయిన్ గా అయితే విక్రమ్ క్లైమాక్స్ లో “రోలెక్స్.. వాడి పేరు ఢిల్లీ” అనే డైలాగ్ అయితే మరింత క్లిక్ అయ్యింది.

దీనితో ఈ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ ఎలా ఉంటుంది? సినిమాలో పవన్ తో సీన్స్ ఏ లెవెల్లో ఉంటాయా అని ఫ్యాన్స్ చాలా ఎగ్జైట్ అవుతున్నారు. ఇక ఈ చిత్రంలో అయితే ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు భారీ వ్యయంతో నిర్మాణం వహిస్తున్నారు.