చావురా చావు.. సుధీర్ పరువు తీసిన రోజా!!

రష్మి గౌతమ్, సుడిగాలి సుధీర్, రోజా మధ్యలో కౌంటర్లు ఎలా పడుతుంటాయో అందరికీ తెలిసిందే. వారు స్కిట్స్‌లో స్క్రిప్ట్ ఎలా రాసుకున్నా జడ్జ్‌గా ఉన్న రోజా మాత్రం అక్కడికక్కడే పంచ్‌లు వేసేస్తుంది. దీంతో షాక్ అవ్వడం సుధీర్, రాం ప్రసాద్, గెటప్ శ్రీను వంతు అవుతుంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలోనూ ఇలా ఈ ముగ్గురికి రోజా పంచ్ వేసేసింది. ఇక వీరి స్కిట్‌లోనే రష్మీ, రోజా ఇన్వాల్వ్‌మెంట్ ఎక్కువగా ఉంటుందన్న విషయం తెలిసిందే.

Roja Satires On Sudheer In Extra Jabardasth
Roja Satires On Sudheer In Extra Jabardasth

అయితే వచ్చే వారం ఎపిసోడ్‌లో సుధీర్ వేరే టీంలోనూ గెస్ట్‌గా చేసినట్టున్నాడు. అందులో సుధీర్ వీధుల్లో కొరడాలతో కొట్టుకునే గెటప్ వేసుకున్నాడు. అయితే అందులో సుధీర్ వేసిన పంచులు ఒకెత్తు అయితే.. రష్మీ, రోజా వేసినవి మరో ఎత్తు. యాంకర్ రష్మీని చేసుకుందామనుకుంటే.. అడుక్కునే రష్మీని చేసుకోవాల్సి వచ్చింది అంటూ సుధీర్ తన ఫ్రస్ట్రేషన్‌ను బయట పెట్టాడు. ఇలా ఉండగా.. రష్మీ వద్దకు వెళ్లి తన పాత డైలాగ్‌ను చెప్పి ఇంప్రెస్ చేయాలని చూశాడు.

Roja Satires On Sudheer In Extra Jabardasth
Roja Satires On Sudheer In Extra Jabardasth

నేను చచ్చిపోతే నువ్ ఏడుస్తావో లేదో గానీ నువ్ ఏడిస్తే మాత్రం నేను చచ్చిపోతాను అనే అరిగిపోయిన డైలాగ్ కొట్టేలోపే రోజా పూర్తి చేసేసింది. అలా పూర్తి చేయడమే కాకుండా చావురా చావు అంటూ ఎక్స్ ట్రాగా సెటైర్ వేసింది. దీంతో సుధీర్‌కు ఏం చేయాలో పాలు పోలేదు. ఇలా సుధీర్ తన పాత డైలాగ్‌లతో స్టేజ్ మీదకు వచ్చినా ఎంటర్టైన్ చేయడంలో మాత్రం ఎప్పుడు విఫలం కాలేదు. అందుకే సుధీర్‌కు ఆ రేంజ్ ఫాలోయింగ్ ఉంటుంది.