గుర్తు చేసిన మరీ పరువుతీస్తోంది..చలాకీ చంటిని ఆడుకున్న రోజా

Roja Satires On Chalaki Chanti In Jabardasth

జబర్దస్త్ షో ప్రారంభంలో ఉన్న వారెవ్వరూ దాదాపు ఇప్పుడు లేరు. మధ్యలో కొందరు వెళ్లారు.. మళ్లీ వచ్చారు.. మళ్లీ వెళ్లారు.. మళ్లీ వచ్చారు.. కానీ ఈ వెళ్లి రావడంతో మధ్యలో ఉన్న టైంలో ఎన్నో మారిపోయాయి. కంటెస్టెంట్లు, ఆర్టిస్ట్‌లుగా ఉన్నవారు టీం లీడర్లుగా మారారు. టీం లీడర్లుగా ఉన్న వాళ్లు కాస్త గ్యాప్ ఇవ్వడంతో వారి ఉనికికే ప్రమాదం ఏర్పడింది. అలాంటి సమయంలో ధన్ రాజ్, వేణు, చంటి వంటి వారు అలా ఎంట్రీలు ఇవ్వడం ఎగ్జిట్ అవ్వడం చేస్తూ వచ్చారు.

Roja Satires On Chalaki Chanti In Jabardasth
Roja Satires On Chalaki Chanti In Jabardasth

అలా రెండు సార్లు చేశారు. కానీ మళ్లీ ఇమడలేక వెళ్లిపోయారు. ధన్ రాజ్, వేణు పూర్తిగా షోలను మానేసి సినిమాల వైపుకు వెళ్లిపోయారు. చలాకీ చంటి మాత్రం ఈటీవీలో ఇతర షోలు చేసుకుంటూ ఉండిపోయాడు. మళ్లీ జబర్దస్త్ స్టేజ్ మీదకు ఎక్కి స్కిట్స్ చేస్తున్నాడు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో రోజా చలాకీ చంటి పరువును తీసేసింది. జబర్దస్త్‌లోకి ఎంట్రీలు, ఎగ్జిట్‌లు ఇస్తుంటావని నేరుగా అందరి ముందే చెప్పేసింది.

నా పేరు చలాకీ చంటి.. 2013 నుంచి టీం లీడర్.. హైద్రాబాద్‌లో ఉంటాను అంటూ తన ఇంట్రడక్షన్ గురించి చెబుతున్నాడు. మధ్యలో రోజా కలగజేసుకుని.. రెండుసార్లు బయటకు వెళ్లి వచ్చావ్ అని గుర్తు చేసింది. ఏం చెప్పాలో తెలియక అవును రెండు సార్లు ఎగ్జిట్ రెండు సార్లు ఎంట్రీ అని చలాకీ చంటి తన స్కిట్‌ను మొదలెట్టేశాడు. అయితే ఇది స్కిట్ కోసం చెప్పించిన డైలాగో ఏమో తెలీదు కానీ బయటకు వెళ్లి వచ్చిన వాళ్లపై ఏదో రకమైన చర్యలుంటాయనే చెప్పేలానే కనిపిస్తోంది.