Roja: జబర్దస్త్ కు గుడ్ బై చెప్పి రీ ఎంట్రీ ఇచ్చిన రోజా.. ప్రోమో వైరల్.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు!

Roja: ఒకప్పటి స్టార్ హీరోయిన్ రోజా తన అందం అభినయంతో హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది.ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో కి గత కొన్ని సంవత్సరాలుగా జడ్జిగా వ్యవహరించింది. రోజా ఇటు రాజకీయాలు, అటు టీవీ షోస్, భర్త పిల్లలు ఇలా అన్ని బాధ్యతలు సమర్థవంతంగా నెట్టుకొస్తు ఎంతోమంది మహిళలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఇటీవల రోజా గారికి మంత్రి పదవి దక్కిన విషయం అందరికీ తెలుసు. అయితే ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్న మంత్రి పదవి దక్కడంతో ఇక తన సమయాన్నంతా ప్రజాసంక్షేమం కోసం కేటాయించాలి అన్న ఉద్దేశంతో రోజా గారు జబర్దస్త్ షో కి గుడ్ బై చెప్పారు.

ఈ సందర్భంగా మల్లెమాల వారితోపాటు జబర్దస్త్ కమెడియన్లు అందరూ కూడా రోజా గారి తో ఉన్న అనుబంధం గురించి చెప్పుకొచ్చారు. జబర్దస్త్ లో రోజా గారి స్థానాన్ని నటి ఇంద్రజ గారు భర్తీ చేశారు. అయితే ఇటీవల విడుదలైన జబర్దస్త్ ప్రోమో చూసిన ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే ఈ ప్రోమోలో రోజా గారి స్థానంలో ఇంద్రజ కాకుండా రోజా గారు కనిపించడంతో అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. రోజా గారు మళ్లీ జబర్దస్త్ కి రీ ఎంట్రీ ఇచ్చారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి.

మంత్రి పదవి దక్కడం తో జబర్దస్త్ కి స్వస్తి చెప్పిన రోజా గారు మళ్ళీ జబర్దస్త్ లో కనిపించడంతో కొంత మంది ఆనంద పడితే మరికొంత మంది మాత్రం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి పదవి వచ్చిన తర్వాత కూడా రోజా జబర్దస్త్ కంటిన్యూ చేస్తుందా ? అని ఆలోచనలో ఉన్నారు. అయితే ఈ ఎపిసోడ్ ఎప్పుడో షూట్ జరిగి ఉండవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు.మొత్తానికి రోజా గారు ఇలా తన పంచ్ లతో జబర్దస్త్ లో సందడి చేయటంతో జబర్దస్త్ కి కల వచ్చింది.