సెంటిమెంట్‌ను బ్రేక్ చేసేలానే ఉంది.. రచ్చ చేసేందుకు రోజా కూతురు రెడీ!!

Roja Daughter Anshu Malika Will Entry Into Tollywood

ఒకప్పటి నవ్వుల రోజా వెండితెరపై చేసిన మ్యాజిక్ అందరికీ తెలిసిందే. రోజా గ్లామర్‌తో 90వ దశాకాన్ని ఓ ఊపు ఊపేసింది. సీనియర్ జూనియర్ హీరోలు అని తేడా లేకుండా అందరితోనూ కలిసి నటించింది. ముఖ్యంగా చిరంజీవి, బాలకృష్ణ లాంటి హీరోలతో కలిసి చిందులు వేసింది. రోజా గ్లామర్ పరంగానే కాకుండా.. డ్యాన్సుల్లోనూ అదరగొడుతుంది. రోజా వేసే స్టెప్పులకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అయితే మధ్యలో రోజా రాజకీయాల్లోకి వెళ్లిపోవడంతో సినీ రంగానికి దూరమైంది. మధ్యలో అడపాదడపా చిత్రాలు చేసినా అంతగా వర్కౌట్ కాలేదు.

Roja Daughter Anshu Malika Will Entry Into Tollywood
Roja Daughter Anshu Malika Will Entry Into Tollywood

అయితే ఈ మధ్య రోజా ఫ్యాన్స్‌కు ఓ గుడ్ న్యూస్ వచ్చేసింది. రోజా లెగసీని ముందుకు తీసుకెళ్లేందుకు ఆమె కూతురు అన్షు మాలిక రంగంలోకి దిగోబోతోంది. అసలే వారసత్వం హీరోహీరోయిన్లు మంచి ఊపులో ఉన్నారు. అయితే వారసత్వం నుంచి వచ్చిన హీరోలు సక్సెస్ అయ్యారు కానీ హీరోయిన్లు మాత్రం అంతగా విజయం సాధించలేదు. రాధ కూతురు కార్తీక, నాగబాబు కూతురు నిహారిక, శివాత్మిక రాజశేఖర్, శివానీ రాజశేఖర్‌లు అంతగా ఫేమస్ కాలేకపోతున్నారు.

Roja Daughter Anshu Malika Will Entry Into Tollywood
Roja Daughter Anshu Malika Will Entry Into Tollywood

రాజశేఖర్ పెద్ద కూతురు అయితే మొదటి సినిమా అనుకుని మధ్యలోనే ఆపేశారు. ఇలా వారసత్వపు హీరోయిన్లు నిలదొక్కుకోవడం కష్టమవుతున్న సమయంలో.. రోజా కూతురు ఆశా కిరణంలానే కనిపిస్తోంది. వారసత్వపు హీరోయిన్లు సక్సెస్ కాలేరనే అపనమ్మకాన్ని, సెంటిమెంట్‌ను రోజా కూతురు అన్షు మాలిక బ్రేక్ చేయబోతోన్నట్టు కనిపిస్తోంది. మొన్నీమధ్యే కూతురు 17వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరగడం, అందులో అందరి కంటే అన్షు మాలిక హైలెట్ అవ్వడంతో హీరోయిన్ మెటీరియలే అని ఫిక్స్ అయ్యారు. అయితే రోజా కూడా తన కూతుర్ని హీరోయిన్‌గా ఎంట్రీ ఇప్పించేందుకు సుముఖంగానే ఉన్నట్టు తెలుస్తోంది. మరీ ఆ సమయం త్వరలో వస్తుందేమో చూడాలి.