Rohit Sharma: రోహిత్ శర్మ.. నెక్స్ట్ మ్యాచ్‌లో డౌటే?

టీమిండియా ఇప్పటికే ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్‌కు అర్హత సాధించినా, కెప్టెన్ రోహిత్ శర్మ గాయం జట్టుకు కొత్త చిక్కులను తీసుకొచ్చింది. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో తొడ కండరాల గాయాన్ని మూటగట్టుకున్న రోహిత్, న్యూజిలాండ్‌తో లీగ్ చివరి మ్యాచ్‌కు సిద్ధంగా ఉంటాడా? లేదా అతనికి విశ్రాంతి ఇచ్చి ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతారా? అనే చర్చ మొదలైంది. బుధవారం నుంచి టీమిండియా ప్రాక్టీస్ మొదలుపెట్టినప్పటికీ, రోహిత్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయకుండా కేవలం ఫిజియో థెరపీ, స్ట్రెచింగ్‌లకే పరిమితమయ్యాడు.

న్యూజిలాండ్‌తో మ్యాచ్ మార్చి 2న జరగనుండటంతో, రోహిత్‌ను విశ్రాంతిలో ఉంచి సెమీఫైనల్‌కు ఫిట్‌గా తయారు చేయాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోందని సమాచారం. అతను ఆడకపోతే టీమిండియా జట్టులో మార్పులు తప్పవు. ఈ నేపథ్యంలో రిషభ్ పంత్ లేదా వాషింగ్టన్ సుందర్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకురావొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే, శుభ్‌మన్ గిల్‌తో కలిసి ఇన్నింగ్స్ ఓపెన్ చేయడానికి కెఎల్ రాహుల్‌ను పంపే యోచన కూడా ఉందని తెలుస్తోంది.

అయితే, టీమిండియా ఇప్పటికే సెమీఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకున్నప్పటికీ, న్యూజిలాండ్‌పై గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని అందుకోవాలనే ఆలోచనలో ఉంది. మరోవైపు, కీలక ఆటగాళ్లను విశ్రాంతికి పంపించి సెమీస్‌కు సిద్ధం చేసుకోవాలా? అనే స్ట్రాటజీ కూడా టీమ్ మేనేజ్‌మెంట్ పరిశీలిస్తోంది. రోహిత్ గాయం తీవ్రత తగ్గేలా చూసుకుంటూనే, అవసరమైన మార్పులు చేసుకోవడం జట్టుకు కీలకంగా మారనుంది.

అంతిమంగా, న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఆడుతాడా? లేదా? అన్నది టీమ్ మేనేజ్‌మెంట్ చివరి నిమిషంలో తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంది. ఒకవేళ అతనికి పూర్తిగా విశ్రాంతి ఇచ్చినా, జట్టులో సరైన బ్యాటింగ్ కాంబినేషన్‌ను అందుబాటులోకి తేవడమే టీమిండియాకు అసలు సవాలుగా మారనుంది.

ఇరుకున్న రాజమౌళి| Senior Journalist Bharadwaj EXPOSED Raja Mouli Controversy | Uppalapati Srinu | TR