హీరో నితిన్ నటించిన తాజా సినిమా రాబిన్ హుడ్. ఈ సినిమా డిసెంబర్ 25న రిలీజ్ చేస్తామని మూవీ మేకర్స్ ఈ మధ్యనే ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే ఇప్పుడు ఆ సినిమా విడుదల వాయిదా పడుతుందేమో అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హీరో నితిన్ కి మంచి హిట్ ఇచ్చిన సినిమా భీష్మ. ఈ సినిమాకి దర్శకత్వం వహించిన వెంకీ కుడుముల రాబిన్ హుడ్ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.
మరొకసారి ఈ సినిమాతో మ్యాజిక్ క్రియేట్ చేద్దాం అనుకున్న ఈ మూవీ టీం కి ఇప్పుడు లేనిపోని అవంతరాలు ఎదురవుతున్నాయి. దానికి కారణం పుష్ప 2 సినిమాపై ప్రజలకి ఇంకా క్రేజ్ తగ్గకపోవడం, దాంతోపాటు ఈ సినిమాని మూడో వారం కూడా థియేటర్లలో ప్రదర్శించడానికి యాజమాన్యం ఉత్సాహం చూపిస్తున్నట్లు సమాచారం. ఆ వారంలో టిక్కెట్లు రేట్లు తగ్గుతాయి కాబట్టి భారీ పికప్ ఉంటుంది అంటున్నారు. ఈ అన్ని సంఘటనలు రాబిన్ హుడ్ సినిమా ప్రమోషన్స్ కి ఆటంకంగా మారాయి.
అయితే మరి రాబిన్ హుడ్ ఏం చేయబోతున్నాడు, డిసెంబర్ 25న విడుదల కాకపోతే పండగ బరిలోనే దిగాలి అయితే అప్పుడు గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్ లాంటి పెద్ద సినిమాలు వస్తున్నాయి. వాటితో నితిన్ రాబిన్ హుడ్ పోటీ పడటం అంత మామూలు విషయం కాదు. పండగ సీజన్ వదిలేస్తే వచ్చేది రిపబ్లిక్ డే సీజన్. జనవరి 26న ఎటువంటి సినిమాలు రిలీజ్ కి లేవు కాబట్టి ఆ డేట్ లో రిలీజ్ ఉండొచ్చు అంటున్నారు సినీ క్రిటిక్స్.
మరి ఈ రిలీజ్ విషయంపై మూవీ టీం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. ఇక ఈ సినిమాలో నితిన్ హీరోగా నటించిన శ్రీ లీల హీరోయిన్ గా నటించగా మరొక హీరోయిన్ కేతిక శర్మ కూడా ఒక స్పెషల్ సాంగ్ చేశారు. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఎలమంచిలి ప్రొడ్యూస్ చేశారు. ఈ సినిమాలో నటకిరిటీ రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ ప్రధాన తారాగణం ఈ చిత్రానికి రచన దర్శకత్వం వెంకీ కుడుముల కాగా సంగీతం జీవి ప్రకాష్ కుమార్.