బొమ్మరిల్లు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరైన బ్యూటీ జెనీలియా. హా హా హాసిని అంటూ చాలా అమాయకంగా ఈ చిత్రంలో నటించిన జెనీలియా బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్‌తో ప్రేమలో పడింది. 2012లో వీరిద్దరు పెద్దలని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెళ్లై 8 సంవత్సరాలు అవుతున్నప్పటికీ, భార్య భర్తలు చాలా అన్యోన్యంగా ఉంటారు. తన భర్త గురించి ఎవరైన వెటకారంగా మాట్లాడితే జెనీలియా అస్సలు ఊరుకోదు.
ఇటీవల కామెడీ విత్ కపిల్ శర్మ షోలో రితేష్, జెనీలియా పాల్గొన్నారు. ఇందులో జెనీలియా తన భర్తకు సంబంధించిన విషయాన్ని తెలియజేస్తూ.. బెంగళూరులో మ్యాచ్ చూడటానికి వెళ్ళారు. అప్పుడు రితేని ఓ ఇద్దరు వ్యక్తులు.. మీరు జెనీలియా భర్త కదా అని అడిగారు. దాంతో నా ఇగో హర్ట్ అయింది. దాంతో వెంటనే నేను ఒక్క రాష్ట్రంలోనే ఆయనని జెనీలియా భర్త అంటారు. కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో రితేష్ భార్య అంటారు అని చెప్పుకొచ్చింది. అయితే శనివారం రోజు ఈ జంట దీవాళి పండుగను ఘనంగా జరుపుకుంది.
రితేష్ దీవాళి సెలబ్రేషన్స్‌కు సంబంధించిన విషయాన్ని తెలియజేస్తూ.. మా అమ్మ వైశాలి పాత చీరతో తయారు చేసిన డ్రెస్సులని నా పిల్లలతో పాటు నేను ధరించాను అని సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. ఒకే డ్రెస్‌లో కనిపిస్తున్న ముగ్గురిని చూసి నెటిజన్స్ నవ్వుకుంటున్నారు. దీవాళి పండుగ సందర్భంగా మీరు అమ్మ చీరతో కుట్టించుకున్న బట్టలు అద్భుతంగా ఉన్నాయి. ఆలోచన బాగుంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. రితేష్ షేర్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.దీవాళి పండగ కోసం అమ్మ పాత చీరతో పిల్లలకు డ్రెస్ కుట్టించిన హీరో.. నవ్వుకుంటున్న నెటిజన్స్