RGV : రామ్ గోపాల్ వర్మ ఏమి మాట్లాడినా వివాదమే. వివాదంలో ఆయన జీవిస్తున్నారో, వివాదం ఆయనతో జీవిస్తోందో మనలాంటి జీవులకు అర్థంకాదు. ఇక ఆర్ ఆర్ఆర్ సినిమా గురించి అందరు ప్రశంసలు కురిపిస్తున్నారు. జక్కన్న కు రామ్ చరణ్, ఎన్టీఆర్ లపై పొగడ్తల వెల్లువ కురుస్తోంది.ఇక అందరు మెచ్చుకున్నారు ఈ సినిమాపై వర్మ ఎలా రియాక్ట్ అవుతాడో అని అందరు అనుకున్నారు. అయితే తొలుత నీతో ఇద్దరు డేంజరస్ మెన్ ఉంటే నాతో ఇద్దరు డేంజరస్ ఉమెన్ ఉన్నారు అంటూ సోషల్ మీడియా లో రాజమౌళి ఉద్దేశించి పోస్ట్ పెట్టి వైరల్ అయ్యారు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాపై పాజిటివ్ గా స్పందించి అందరిని ఆశ్చర్య పరిచారు.
ఇక లేటెస్ట్ గా మరోసారి ఆర్ఆర్ఆర్ గురించి మాట్లాడుతూ గ్రేట్ సినిమా అన్నారు. అయితే వర్మ ఇంత సింపుల్ గా మాట్లాడుతారా.. అక్కడింకేదో మెలిక పెట్టాలిగా.ఆర్ఆర్ఆర్ కంటే ముందు విడుదలైన కాశ్మీర్ ఫైల్స్ గురించి వర్మ అంతకు ముందు కూడా బాగా చెప్పారు. సినిమా ఇప్పటి తరానికి ఎలాంటి సినిమాలు తీయాలో మార్గదర్శకం అవుతాయాని చెప్పారు. ఇక ఇపుడు మరోసారి కాశ్మీర్ ఫైల్స్ ను ఆర్ ఆర్ఆర్ తో పోల్చాడు.
ఇక ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా కంటే మరో సినిమా చాలా గొప్పది అంటూ వర్మ షాకింగ్ కామెంట్స్ చేశాడు. దాదాపు వెయ్యి కోట్ల కలెక్షన్స్ రాబట్టి అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది ఆర్ఆర్ఆర్. ఆర్ఆర్ఆర్ సినిమా తో పోల్చి చూస్తే ది కాశ్మీర్ పైల్స్ బెస్ట్ సినిమా అని చెప్పుకొచ్చాడు. 10 కోట్ల బడ్జెట్ తో రూపొందిన కాశ్మీరు ఫైల్స్ సినిమా విజయమే దీనికి ఉదాహరణ అంటూ తెలిపాడు. ఇక ఈ సినిమా నిజమైన గేమ్ చేంజర్ సినిమా అంటు అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఆర్ఆర్ఆర్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. అది హిట్ అవ్వడం సాధారణం . కానీ కాశ్మీర్ ఫైల్స్ లాంటి సినిమా ఎంతో మంది నిర్మాతల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది అంటూ వ్యాఖ్యానించాడు.10కోట్లా బడ్జెట్ సినిమా దాదాపు 200కోట్లు వసూలు చేసి అందరిని ఆశ్చర్య పరిచింది కాశ్మీర్ ఫైల్స్. కాబట్టి వర్మ చెప్పిన లాజిక్ కరెక్టే అనిపిస్తుంది.