నా పిల్లలు పెద్దయ్యాక అదే చేస్తారు.. క్లారిటీ ఇచ్చిన రేణూ దేశాయ్

రేణూ దేశాయ్ పిల్లలు అకీరా నందర్, ఆద్యల టాలెంట్ గురించి అందరికీ తెలిసిందే. ఇక అకీరా నందన్ గురించి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. జూనియర్ పవర్ స్టార్ అంటూ ఫ్యాన్స్ సందడి చేస్తుంటారు. అలా అనకండి అంటూ రేణూ దేశాయ్ హెచ్చరిస్తూనే ఉంటుంది. ఇక ఆద్యలో ఉన్న ఫోటోగ్రఫీ టాలెంట్ మనకు తెలిసిందే. వీరు పెద్దయ్యాక ఏం చేస్తారో అని ఓ ప్రశ్న నెటిజన్ల మదిలో ఎప్పుడూ మెదులుతూనే ఉంటుంది.

అయితే అకీరా నందన్ మాత్రం తన లైఫ్ యాంబినేషన్ మాత్రం నిత్యం మారుస్తుంటాడని ఆ మధ్య రేణూ దేశాయ్ చెప్పింది. ఓ సారి హీరో అంటాడు, ఇంకోసారి ఫుల్ బాల్ ప్లేయర్ అవుతా అంటాడు మరోసారి ఇంజనీర్ అవుతానని అంటాడట. అయితే రేణూ దేశాయ్ మనసులో మాత్రం వేరే కోరిక ఉంది. రేణూ దేశాయ్ ఓ రైతు బిడ్డ అన్న సంగతి తెలిసిందే. చిన్నతనంలోనే రైతుల సమస్యలను, వారి బాధలను చూశానని ఎన్నో సార్లు చెప్పింది.

అందుకే తన పిల్లలకు కూడా వారి కష్టాలను చెబుతానని, వ్యవసాయం గొప్పదనాన్ని వివరిస్తానని చెప్పుకొచ్చింది. వారు పెద్దయ్యాక కచ్చితంగా రైతులు అవుతారని, వ్యవసాయం చేస్తారని ధీమా వ్యక్తం చేసింది. వారికి మట్టి వాసన కూడా తెలుసని, ఆ విధంగా పెంచానని చెప్పుకొచ్చింది. రైతుల గురించి తెలుసుకాబట్టే సినిమా తీస్తున్నానని చెప్పుకొచ్చింది. ఈ విషయాలన్నీ రేణూ దేశాయ్ తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ మనసులోని సంగతులను బయటపెట్టింది.