Akira Nandan: కోట్లలో ఆస్తులు.. ఈ పనులు ఏంటీ అకీరా… అడ్డంగా దొరికిపోయాడుగా?

Akira Nandan: అకీరా నందన్ పరిచయం అవసరం లేని పేరు. పవన్ కళ్యాణ్ కుమారుడిగా అందరికీ ఎంతో సుపరిచితమైన అకీరా ఇప్పటివరకు ఒక సినిమాలో కూడా నటించలేదు కానీ ఈయనకు మాత్రం హీరో రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక అకిరా పవన్ కళ్యాణ్ కుమారుడు కావడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ కూడా ఎంతో అమితంగా ఇష్టపడుతున్నారు. ఇక అకీరా హీరోగా ఇండస్ట్రీలోకి రావాలని ఎంతగానో కోరుకుంటున్నారు. ఇకపోతే ఇటీవల కాలంలో అకీరా పెద్ద ఎత్తున వార్తలు నిలుస్తున్న సంగతి తెలిసిందే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ రాజకీయాలకు వచ్చిన తర్వాత అకీరా ఎక్కడికి వెళ్ళినా తన తండ్రితో పాటే కనిపిస్తున్నారు.

గుంటూరులోని మార్కాపురం పర్యటనలో భాగంగా తన ఇద్దరు కుమారులతో కలిసి కనిపించిన సంగతి తెలిసిందే. ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. అయితే ఈ ఫోటో కారణంగా మొదటిసారి అకీరా విమర్శలను కూడా ఎదుర్కొంటున్నారు అయితే ఈ విమర్శలు చేసే వారిలో పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఉండటం విశేషం. మరి అకీరా పై ఈ స్థాయిలో విమర్శలు రావడానికి గల కారణం ఏంటనే విషయానికి వస్తే…

ఇటీవల పవన్ కళ్యాణ్ తన ఇద్దరు కుమారులతో కలిసి కనిపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఫోటోలలో భాగంగా అఖీరా గత కొద్ది రోజుల క్రితం తన తండ్రి పవన్ కళ్యాణ్ వేసుకున్న ప్యాంట్ తిరిగి వేసుకోవడంతో విమర్శలు వస్తున్నాయి. కోట్లలో ఆస్తులు ఉన్నాయి కదా తిరిగి మీ తండ్రి ఫ్యాంట్ వేసుకోవడం ఏంటి? అంటూ కొందరు కామెంట్లు చేయగా.. మరి కొందరు మాత్రం ఏదో కబోర్డ్ లో ఉంది కదా అని తీసివేసేసుకున్నావా అకీరా అంటూ విమర్శలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఇకపోతే అకీరా త్వరలోనే ఇండస్ట్రీలోకి రావాలని అభిమానులు ఎంతగానో కోరుకుంటున్నారు కానీ ఇప్పటివరకు అకీరా సినీ ఎంట్రీ గురించి మాత్రం ఎక్కడా పవన్ కళ్యాణ్ కానీ అటు రేణు దేశాయ్ కానీ స్పందించిన దాఖలాలు లేవు.