దమ్ముంటే నన్ను పట్టుకోండి.. రేణూ దేశాయ్ సవాల్!!

సోషల్ మీడియాలో రేణూ దేశాయ్ ఎంత యాక్టివ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాతావరణం, జంతువులు, పెట్స్, సమాజంలోని సమస్యలు, ఆడవారిపై దౌర్జన్యాల గురించి రేణూ దేశాయ్ నిత్యం స్పందిస్తూనే ఉంటుంది. ఇక ఇవే కాకుండా వ్యక్తిగత విషయాలను, ఆద్య, అకీరాల టాలెంట్ గురించి తన ఫాలోవర్స్‌కు ఎప్పటికప్పుడు చెబుతూనే ఉంటుంది. తాజాగా రేణూ దేశాయ్ తన ఫిట్‌నెస్ మీద శ్రద్దపెట్టిందన్న సంగతి తెలిసిందే.

Renu desai Escaped from Gym Without Doing Workout

లాక్ డౌన్ సమయం ముగిశాక రేణూ దేశాయ్ జిమ్‌కు వెళ్లడం మొదలెట్టింది. రోజూ ఉదయాన్నే రేణూ దేశాయ్ వ్యాయామం చేసేది. కానీ మధ్యలో క్లాసులను ఎగ్గొట్టేందుకు చాలానే ప్రయత్నించేది. దాని కోసం తన పిల్లిని సాకుగా చూపెట్టేది కూడా. ఫీబో రానివ్వడం లేదు, తన వొళ్లేనే కూర్చొంటోంది జిమ్‌కు వెళ్లనివ్వడం లేదు అంటూ వీడియోలకు కూడా షేర్ చేసేది. తాజాగా రేణూ దేశాయ్ చేసిన పోస్ట్ అందరిలో ఆసక్తి నింపుతోంది.

Renu desai Escaped from Gym Without Doing Workout

అసలే ప్రస్తుతం రేణూ దేశాయ్ పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. ఆద్య అనే లేడీ ఓరియెంటెడ్ ప్యాన్ ఇండియన్ చిత్రాన్ని ఓకే చెప్పింది. ఇందులో నందినీ రాయ్, ధన్సికలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం రేణూ దేశాయ్ మరింత తగ్గాలని భావించినట్టుంది. కానీ జిమ్‌లో వ్యాయామం చేయకుండా తప్పించుకుంటోంది. జిమ్ ట్రైనర్‌కు కనిపించకుండా దాక్కుంటోంది. దమ్ముంటే నేను ఎక్కడున్న కనిపెట్టండి అంటూ ఓ పోస్ట్ చేసింది. అందులో రేణూ దేశాయో ఓ మూలకు కూర్చున్నట్టు కనిపిస్తోంది.