ఆ సమయంలో తల్లిగా సంతోషమేస్తుంది.. రేణూ దేశాయ్ ఎమోషనల్

Renu desai Emotional About Akira Nandan and Aadya

రేణూ దేశాయ్ పిల్లల విషయంలో ఎమోషనల్ అవుతుందన్న సంగతి తెలిసిందే. ఆద్య, అకీరా నందన్‌లే లోకంగా బతుకుతున్న రేణూ దేశాయ్‌ పిల్లల విషయంలో, వారిని పెంచిన విధానంతో సంతోష పడుతుందట. ఎవరైనా పిల్లల నడవడిక గురించి గొప్పగా చెబితే తల్లిగా ఎంతో సంతోష పడతానని చెప్పుకొచ్చింది. నేడు రేణూ దేశాయ్ బర్త్ డే సందర్భంగా సుమ స్పెషల్ సర్ ప్రైజ్ ఇచ్చింది. సుమ చేసే ఈట్ టాక్ షో ఎపిసోడ్‌‌ను నేడు స్పెషల్‌గా రిలీజ్ చేసింది.

Renu desai Emotional About Akira Nandan and Aadya
Renu desai Emotional About Akira Nandan and Aadya

మామూలుగా గెస్ట్‌లను పిలిచి వారితో ఓ స్పెషల్ వంటకాన్ని వడ్డిస్తూ ఫన్ క్రియేట్ అయ్యేలా చేస్తుంది. రేణూ దేశాయ్ ఎపిసోడ్‌లోనూ అలానే జరిగింది. ఎంత ఎంటర్టైన్మెంట్ ఉందో.. అంతకుమించి ఎమోషనల్‌గా సాగింది. పిల్లల గురించి చెబుతూ రేణూ దేశాయ్ కన్నీరు పెట్టేసుకుంది. బెస్ట్‌ మామ్‌ ఎవర్‌ అని టీ కప్పుపై పిల్లలతో దిగిన ఫోటోను వేసి గిఫ్ట్‌గా సుమ ఇస్తే.. దాన్ని చూసి రేణూ దేశాయ్ ఎమోషనల్ అయింది.

రేణూ దేశాయ్ తన పిల్లల గురించి మాట్లాడుతూ.. వాళ్లు ఎప్పుడైనా ఫంక్షన్స్‌, పవన్‌కల్యాణ్‌ షూటింగ్స్‌కి వెళ్లినప్పుడు ప్రొడ్యూసర్స్‌, డైరెక్టర్స్‌ ఇతర నటీనటులు ఫోన్‌ చేసి.. ‘ఆద్య, అకీరా చక్కగా ఉన్నారు. మీ పిల్లలు అందరితో కలిసిపోతున్నారు’ అని చెప్పినప్పుడు ఒక తల్లిగా తనకెంతో సంతోషంగా అనిపిస్తుందని రేణూ దేశాయ్ ఎమోషనల్ అయింది. అయినా ఆద్య, అకీరా ఎంత పద్దతిగా ఉంటారో అందరికీ తెలిసిందే.