ఆ విషయంలో రేణూ దేశాయ్‌కి ఆ హీరోయిన్ గురువట!!

Renu Desai Blue Colour short Hair

రేణూ దేశాయ్ తాజాగా తన లుక్కును మార్చేసింది. క్యాన్సర్ పేషెంట్ కోసం తన జుట్టును దానం చేసింది. గతంలోనూ ఓ సారి ఇలానే చేసిందట. 2105లో ఓసారి తన జుట్టును దానం చేయగా.. తాజాగా మరోసారి ఇచ్చానని తెలిపింది. అందుకు జట్టు కట్ చేశానని తెలిపింది. అయితే ఈ మేరకు రేణూ దేశాయ్ లైవ్‌లోకి వచ్చింది. తాను ఓ వెబ్ సిరీస్‌కు సైన్ చేశానని, అ ప్రాజెక్ట్ విశేషాలు చెప్పేందుకు లైవ్‌లోకి వచ్చానని పేర్కొంది.

Renu Desai Blue Colour short Hair
Renu Desai Blue Colour short Hair

ఈ క్రమంలో లైవ్‌లో ఉన్న రేణూ దేశాయ్‌ను నెటిజన్లు రకరకాల ప్రశ్నలు సంధించారు. చాలా కాలం నుంచి సినిమాల్లో నటించాలని ఎదురు చూశానని అయితే సరైన స్క్రిప్ట్ కోసం వెతుకుతున్నానని వెల్లడించింది. లక్కీగా ఓ అద్భుతమైన స్క్రిప్ట్ దొరికిందని, ఈ వెబ్ సిరీస్‌లో తన పాత్ర కొత్తగా ఉంటుందని పేర్కొంది. ఆ జుట్టు అలా ఎందుకు అయింది? కలర్ ఎందుకు వేశారని కొంతమంది అడిగారు.

Renu Desai Blue Colour short Hair
Renu Desai Blue Colour short Hair

క్యాన్సర్ పేషెంట్ కోసం జుట్టు దానం చేశాను. కట్ చేయడం వల్ల చిన్నగా అయిపోయింది. ఇక కొత్త ప్రాజెక్ట్ కోసం ఈ రంగు వేశానని తెలిపింది. ఇది కేవలం ఓ నెల రోజులు మాత్రమేనని తెలిపింది. తాజాగా తన జుట్టుకు రంగు వేసిఉన్న ఫోటోను షేర్ చేయగా అది తెగ వైరల్ అయింది. ఈ ఫోటోకు అదా శర్మ కామెంట్ చేస్తూ.. హాట్ అని పేర్కొంది. ఇక ఈ కామెంట్‌కు రేణూ దేశాయ్ స్పందిస్తూ.. నువ్వే కదా నా గురువు అని పేర్కొంది. ఇక అదా శర్మ ఇలా జుట్టుకు వింత వింత రంగులు వేసుకోవడం అలవాటన్న సంగతి తెలిసిందే కదా.