ఆద్యను అలా ఇరికించేసింది.. రేణూ దేశాయ్ వీడియో వైరల్

రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో ఎంతగా హల్చల్ చేస్తుందో అందరికీ తెలిసిందే. పిల్లల గురించి, వారు చేసే అల్లరి గురించి చెబుతూ ఉంటుంది. ముఖ్యంగా ఆద్య చేసే అల్లరి గురించి చెబుతూ ఉంటుంది. అకీరా నందన్ సైలెంట్‌గా ఉంటాడని కానీ ఆద్య మాత్రం ఫుల్ అల్లరి చేస్తుందని చెబుతూ ఉంటుంది. ఆద్యలో ఉన్న స్పెషల్ టాలెంట్ల గురించి తన ఫాలోవర్లకు చెబుతూ ఉంటుంది. ఫోటోగ్రఫీలో ఆద్యకు టాలెంట్ అందరికీ తెలిసిందే.

 

ఈ లాక్డౌన్ కాలంలో ఆద్య వంటలపైనా శ్రద్ద ఎక్కువగా పెట్టింది. ఆరోగ్యకరమైన, పోషకాలతో కూడిన వంటలు ఎలా వండాలో నేర్చుకుంది. ఆద్య వంటలు నేర్చుకుంటున్న వీడియోలను కూడా రేణూ దేశాయ్ షేర్ చేసింది. తాజాగా రేణూ దేశాయ్ దీపావళి పండుగ గురించి ఓ మెసెజ్ చెబుతూ వీడియోను షేర్ చేసింది. క్రాకర్స్ కాల్చడం అయితే ఎవ్వరూ మానలేరు.. కానీ వీలైనంత తక్కువగా కాల్చండి.. ఎందుకంటే మన సంప్రదాయంలో క్రాకర్స్ కాల్చడమనేది ఎప్పటి నుంచి వస్తోందని రేణూ దేశాయ్ చెప్పుకొచ్చింది.

అయితే తాజాగా రేణూ దేశాయ్ ఓ వీడియోను షేర్ చేసింది. అందులో ఆద్య బుక్కైపోయింది. ఇంటి గుమ్మం ముందు ఆద్య దీపాలు పెడుతూ ఉండగా రేణూ దేశాయ్ వీడియోలో బంధించింది. దీపావళి శుభాకాంక్షలు చెప్పు.. ఇన్ స్టా వీడియో చేస్తోన్నాను అని ఆద్యతో రేణూ దేశాయ్ చెప్పుకొచ్చింది. అయితే ఆద్య మాత్రం తెలుగులో అంత ఫ్లూయెంట్ కాకపోవడంతో శుభాకాంక్షలు అని చెప్పడంతో తడబడింది. ఆద్య అలా తడబడటంతో రేణూ దేశాయ్ నవ్వేసింది.