“పుష్ప 2” కి రికార్డు బ్రేకింగ్ రెస్పాన్స్.!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ “పుష్ప 2”. కాగా ఈ సినిమాని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో రిలీజ్ చేయడానికి భారీ సన్నాహాలు కూడా చేస్తున్నారు. అయితే ఓ ఇంట్రెస్టింగ్ వీడియోని రిలీజ్ చేసినప్పటికీ సినిమా షూటింగ్ మాత్రం చాలా టైం తీసుకోనుంది.

ఇంకా ఎలా లేదన్నా 200 కి పైగా రోజులు సినిమాకి పనులు జరగనున్నాయి. మరి అయినప్పటికీ ఇపుడు సినిమాపై హైప్ ఎలా ఉంది అంటే ముందు ఉన్న అన్ని సీక్వెల్స్ రికార్డులు కూడా బద్దలు అయ్యే రేంజ్ లో ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదు. మినిమమ్ గా అయితే 1000 కోట్లు గ్రాస్ ని ట్రేడ్ వర్గాలు వారు అంచనా వేస్తుండగా.

నిన్న వచ్చిన పుష్ప హంట్ వీడియోకి రికార్డు బ్రేకింగ్ రెస్పాన్స్ వచ్చినట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. 24 గంటల్లో 55 మిలియన్ కి పైగా వ్యూస్ 2 మిలియన్ కి పైగా లైక్స్ ని పుష్ప ది రూల్ అన్ని భాషల్లో కొల్లగొట్టి రికార్డులు బ్రేక్ చేసింది. సౌత్ ఇండియా నుంచి వచ్చిన ఓ టీజర్ గ్లింప్స్ కి ఈ రేంజ్ లో రెస్పాన్స్ రావడం ఇదే మొదటి సారి అని కూడా తెలుస్తుంది.

ఇప్పుడు అయితే యూట్యూబ్ లో టాప్ ట్రెండింగ్ లో కూడా ఈ వీడియో కొసాగుతూ ఉండగా ఈ వీడియో మాత్రం సినిమాపై అంచనాలు ఒక్కసారిగా అమాంతం పెంచేందుకు బాగా పనికొచ్చింది అని చెప్పాలి. ఇక ఈ మాసివ్ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు అలాగే సుకుమార్ మరియు మైత్రి మూవీ మేకర్స్ కలిపి సినిమాని నిర్మాణం వహిస్తున్నారు.