నిజమే.. జబర్దస్త్ అనే కామెడీ షో.. ఎంతోమందికి లైఫ్ ఇచ్చింది. ఎంతో మంది స్టార్ స్టేటస్ ను పొందారు. వాళ్ల టాలెంట్ ను చూపించడానికి జబర్దస్త్ రూపంలో ఒక ప్లాట్ ఫాం దొరికింది. అంతవరకు బాగానే ఉంది. కానీ.. జబర్దస్త్ లో అసలు ఏం జరుగుతోంది. స్కిట్లు చేయడానికి టీమ్ లీడర్లు, కంటెస్టెంట్లు ఎంత కష్టపడతారు. నిజంగా వాళ్ల కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తున్నదా? అనేది మరో కోణం. ఒక కోణం మాత్రమే మనం చూస్తున్నాం. ఇంకో కోణాన్ని కూడా చూస్తే.. ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు, ఎంత మంచిగా స్కిట్ చేసినా.. జడ్జిల నుంచి స్పందన ఉండదు.. ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి.. ఆ కథేందో తెలుసుకుందాం రండి..
జబర్దస్త్ ప్రారంభం అయిన కొత్తలో.. చమ్మక్ చంద్ర, వేణు వండర్స్, ధనాధన్ ధన్ రాజ్, రోలర్ రఘు, అదిరే అభి, రాకెట్ రాఘవ స్కిట్లు మాత్రమే ఉండేవి. వాళ్లలో కొందరు అప్పటికే సినిమాల్లో నటించిన వాళ్లే. కొందరు మాత్రం కొత్తవాళ్లు. కాకపోతే.. సినిమాల్లో నటించినా రాని పాపులారిటీ జబర్దస్త్ తో వచ్చింది.
రోజులు గడుస్తున్న కొద్దీ.. కొన్ని టీంలు తప్పుకోవడం, కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేయడంతో సుడిగాలి సుధీర్, హైపర్ ఆది లాంటి బెస్ట్ టీమ్స్ కూడా ప్రస్తుతం ప్రేక్షకులను అలరిస్తున్నాయి. మొన్నటి వరకు జడ్జిగా ఉన్న నాగబాబు కూడా ఏదో గొడవ రావడంతో వెంటనే జీతెలుగుకు వెళ్లిపోయి అక్కడ అదిరింది కామెడీ షో స్టార్ట్ చేశారు.
అయితే… అన్ని టీంల పర్ ఫార్మెన్స్ ను జబర్దస్త్ లో ఒకేవిధంగా చూడరట. కొన్న టీంల స్కిట్లనైతే అసలు జడ్జిలు చూడరట. ఆ మధ్య రాకేశ్ మాస్టర్ కూడా అదే కామెంట్ చేశాడు. కంటెస్టెంట్ల స్కిట్స్ ను జడ్జిలు అస్సలు పట్టించుకోరని… వాళ్ల పని వాళ్లదే..ఫోన్లు చెక్ చేసుకోవడం, డైరెక్టర్లు నవ్వమని చెప్పినప్పుడు మాత్రం జడ్జిలు నవ్వుతారని ఆయన సంచలన ఆరోపణలు చేశాడు. కొన్ని టీంల స్కిట్లు అయితే జడ్జిలు చూడనే చూడరు అంటూ మరో కామెంట్ కూడా చేశాడు.
అంతేనా… కొన్ని స్కిట్లు అయితే ఎడిటింగ్ లోనే ఎగిరిపోతాయట. వాళ్లు చేసిన స్కిట్ బాగుండకపోతే టెలికాస్ట్ కూడా కాదట. ఇంకా కొన్ని స్కిట్లలో సీన్లను కూడా కట్ చేస్తారట. ఎంతో కష్టపడి స్కిట్లు చేస్తే చివరకు అవి టెలికాస్ట్ కూడా కావట.
ఇక.. కొందరు కంటెస్టెంట్లనైతే కావాలని ఏడిపించడం.. వాళ్లకు పేర్లు పెట్టడం..దాని ద్వారా ఫన్ జనరేట్ చేయాలని అనుకుంటారట. కొందరు కంటెస్టెంట్లు ఎంత బాగా చేసినా కూడా జడ్జిలు మెచ్చుకోరట.
కొత్తగా వచ్చిన తాగుబోతు రమేశ్ పరిస్థితి ప్రస్తుతం అలాగే ఉందట. ఎన్ని స్కిట్లు చేసినా ఆయన స్కిట్లను జడ్జిలు నచ్చడం లేదట. రమేశ్ తో పాటు జీవన్ కూడా ఆయన టీంలోనే చేస్తున్నాడు. ఇద్దరు కలిసి మంచి స్కిట్లు చేస్తున్నా.. వాళ్ల స్కిట్లను ఎవ్వరూ పట్టించుకోవడం లేదట. దీంతో… వాళ్ల స్కిట్ల మీద వాళ్లే సెటైర్లు వేసుకుంటూ ఓ స్కిట్ ను ప్రదర్శించారు. ఆ స్కిట్ కు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎంత కష్టపడినా ప్రతిఫలం దక్కకపోతే.. తమ కష్టాన్ని గుర్తించకపోతే ఏం చేస్తారు ఎవరైనా?