ఇండస్ట్రీ టాక్ : “RC15” పోటీ ఈ భారీ సినిమాతోనే అట.!

ఏ ఇండస్ట్రీ లో అయినా కూడా పండుగ సీజన్ వచ్చింది అంటే ఆ హీట్ అండ్ పోటీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇక ఆ సమయంలో ఒడ్డారు బిగ్ స్టార్స్ సినిమాలు పడుతున్నాయి అనే టాక్ వస్తేనే ఓ రేంజ్ లో అనిపిస్తుంది. కాగా ఈ ఏడాది సంక్రాంతి అలంటి సరైన పోటీనే చూసాము అందులో క్లియర్ కట్ గా మెగాస్టార్ చిరంజీవి నటించిన మాస్ బ్లాక్ బస్టర్ హిట్ వాల్తేరు వీరయ్య విన్నర్ గా నిలిచింది.

ఇక వచ్చే ఏడాది కూడా భారీ పోటీకి రంగం సిద్ధం అవుతుంది. ఆల్రెడీ ఈ రేస్ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సెన్సేషనల్ వరల్డ్ లెవెల్ ప్రాజెక్ట్ అయినటువంటి “ప్రాజెక్ట్ కే” ఆల్రెడీ ఫిక్స్ కాగా ఈ సినిమాకి పోటీగా అయితే మాన్ ఆఫ్ మాసెస్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ రాబోతున్నాడని సినీ వర్గాల్లో లేటెస్ట్ సమాచారం.

బాలీవుడ్ సినీ ట్రాకర్స్ నుంచి కూడా ఇదే సమాచారం ఇప్పుడు వినిపిస్తుంది. రామ్ చరణ్ 15వ సినిమాకి గాను దర్శకుడు శంకర్ అలాగే నిర్మాత దిల్ రాజు కూడా టెంటేటివ్ రిలీజ్ టైం గా సంక్రాంతి సీజన్ నే పెట్టుకున్నారట. దీనితో ఈ భారీ సినిమా రాక ఆల్ మోస్ట్ ఆ సమయానికే ఉండొచ్చని లేటెస్ట్ సమాచారం.

దీనితో రామ్ చరణ్ పోటీ ప్రభాస్ తో ఉంటుందని చెప్పాలి. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ గ్లామ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా అంజలి మరో హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే థమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. దిల్ రాజు తమ బ్యానర్ లో 50వ సినిమాగా తమ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మాణం వహిస్తున్నారు.