ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్ లో మంచి అంచనాలు ఉన్న లేటెస్ట్ భారీ చిత్రాల్లో సెన్సేషనల్ దర్శకుడు శంకర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా చేస్తున్న బిగ్గెస్ట్ కాంబో సినిమా కూడా ఒకటి. అయితే ఈ సినిమా పై లేటెస్ట్ గా ఈ నెల లోనే పలు బిగ్ అప్డేట్స్ ఉంటాయని..
ఆల్రెడీ గట్టి టాక్ రాగా వీటిలో అయితే రీసెంట్ గా సినిమా నిర్మాత దిల్ రాజు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూ లో అయితే కొన్ని అంశాలపై కీలక క్లారిటీ ఇవ్వడం వైరల్ గా మారింది. అయితే ఈ నెలాఖరున రామ్ చరణ్ బర్త్ డే కానుకగా సినిమా టైటిల్ ఏంటి అనేది రిలీజ్ అవుతుంది అని దానికి గాను శంకర్ దగ్గరుండి ప్లానింగ్ లు చేస్తున్నారని కన్ఫర్మ్ చేశారు.
దీనితో అయితే సినిమా టైటిల్ పై అప్పుడు మాసివ్ అప్డేట్ శంకర్ మార్క్ లో రానుంది. ఆల్రెడీ ఈ టైటిల్ అయితే సీఈఓ అని ఫిక్స్ అయ్యిన సంగతి తెలిసిందే. అదే ఆరోజు అనౌన్స్ కానుంది. అయితే ఇక సినిమా రిలీజ్ కోసం మాట్లాడుతూ దిల్ రాజు చేతులెత్తేశారు.
నిర్మాత తాను అయినప్పటికీ రిలీజ్ పెత్తనం దర్శకుడు శంకర్ దే అన్నట్టుగా తెలిపారు. సినిమా రిలీజ్ విషయంలో ఎప్పుడు ఉంటుంది అనేది శంకర్ గారి తుది నిర్ణయం మీదే ఆధార పడి ఉంటుంది అని భారం అంతా అతనిపై వేసేసారు. అంటే శంకర్ తన వీలు చూసుకొని పార్లెల్ గా చేస్తున్న భారతీయుడు 2 రిలీజ్ బట్టి ఈ సినిమా రిలీజ్ ఉంటుందని చెప్పాలి.