Raviteja : రామారావు నుండి మాస్ అప్ డేట్…..!

Raviteja : మాస్ మహారాజ్ గా అభిమానులతో పిలవబడే రవితేజకు ఒక సపరేటు ఫ్యాన్ బేస్ ఉంది. హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా ఫ్యాన్స్ ఆదరిస్తున్నారు. ఇక రాజా ది గ్రేట్, క్రాక్ వంటి సినిమాలతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన రవితేజ వరుసగా సినిమాల్లో నటిస్తున్నారు. రామారావు ఆన్ డ్యూటీ అంటూ ట్రైలర్ వదిలి ప్రేక్షకులలో అంచనాలు పెంచారు. ఇటీవల విడుదలైన ఖిలాడి అంతగా వసూళ్లు రాబట్టుకోలేక పోయిన రామారావు ఆన్ డ్యూటీ సినిమా మీద మాత్రం చాలా ఆశలే పెట్టుకున్నారు.

ఓ నిజాయితీ ప్రభుత్వ ఉద్యోగి పాత్రలో రవితేజ నటన ఈ సినిమాకే హైలెట్‌గా నిలవనుంది. ఇక ఈ సినిమాతో మరోసారి తన సక్సెస్ ట్రాక్‌ను రవితేజ కంటిన్యూ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ భావిస్తోంది. కాగా శరత్ మండవ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో దివ్యాంశ, రజీషాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా నుండి చిత్ర యూనిటూ ఓ సడెన్ సర్‌ప్రైజ్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈరోజు ఉదయం 10.08 గంటలకు ఓ మాసివ్ అనౌన్స్‌మెంట్ ఇస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. దీంతో రామారావు ఆన్ డ్యూటీ నుండి ఎలాంటి అనౌన్స్‌మెంట్ రాబోతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసారు.

YouTube video player

ఇక సినిమా యూనిట్ కాన్సెప్ట్ ట్రైలర్ ను విడుదల చేసి షాక్ ఇచ్చింది. అందరు సినిమా విడుదల తేదిని అనౌన్స్ చేస్తారంటూ అనుకుంటుండగా ట్రైలర్ వదిలి ఆశ్చర్య పరిచారు.పక్కా కమర్షియల్ అంశాలతో అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే కథగా ఈ సినిమాను చిత్ర యూనిట్ తీర్చిదిద్దుతోంది. ఇక ఈ సినిమాలో రవితేజ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతుందని, ఇప్పటికే రిలీజ్ అయిన చిత్ర టీజర్ చూస్తే అర్థం అవుతోంది. ఈ సినిమాను శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూస్ చేస్తుండగా సామ్ సిఎస్ సంగీతం అందిస్తున్నాడు.