Raviteja : మాస్ మహారాజతో జత కట్టనున్న రెడ్ సినిమా హీరోయిన్..!

Raviteja : మాస్ మహారాజ్ గా అభిమానులతో పిలవబడే రవితేజకు ఒక సపరేటు ఫ్యాన్ బేస్ ఉంది. హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా ఫ్యాన్స్ ఆదరిస్తున్నారు. ఇక రాజా ది గ్రేట్, క్రాక్ వంటి సినిమాలతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన రవితేజ వరుసగా సినిమాల్లో నటిస్తున్నారు. రామారావు ఆన్ డ్యూటీ అంటూ ట్రైలర్ వదిలి ప్రేక్షకులలో అంచనాలు పెంచారు. ఇటీవల విడుదలైన ఖిలాడి అంతగా వసూళ్లు రాబట్టుకోలేక పోయిన రామారావు ఆన్ డ్యూటీ సినిమా మీద మాత్రం చాలా ఆశలే పెట్టుకున్నారు.

ఇక చాలా ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. మెగాస్టార్, సల్మాన్ ఖాన్ నటిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి సోదరుడిగా కనిపించనున్నారు రవితేజ అభిమానుల్లో అప్పుడే అంచనాలు సినిమాపై పెరిగిపోయాయి.ఇక రవితేజ మెగాస్టార్ 154 వ సినిమాలో ఆయనకు జోడిగా నివేదా పితురాజ్ నటించనుంది. మొదటిసారి వీళ్లిదరు కలిసి నటించనున్నారు.

నివేదా రెడ్, అలావైకుంఠపురములో,పాగల్, చిత్రలహరి సినిమాల్లో నటించింది. ఇక మరొకసారి విశ్వక్ సేన్ తో జతకట్టనుంది. దాస్ కా దుమ్కీలో నటించనుంది.ఇక మెగాస్టార్ 154వ చిత్రం లో చిరంజీవికి జోడి గా శృతి హాసన్ నటించనుంది. ఈ సినిమా కు లవ కుశ ఫేమ్ బాబీ దర్శకత్వం వహిస్తున్నారు.