బిగ్ అప్డేట్ : భారీ క్లాష్ తో “టైగర్ నాగేశ్వర రావు” రిలీజ్.!

టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ హీరోగా ఇప్పుడు నటిస్తున్న సినిమాల్లో అయితే ఆల్రెడీ ఓ సాలిడ్ థ్రిల్లర్ చిత్రం “రావణాసుర” రిలీజ్ కి సిద్ధం కాగా ఇక నెక్స్ట్ అయితే ఈ సినిమా అనంతరం భారీ లెవెల్లో ప్లాన్ చేస్తున్న తన మొదటి పాన్ ఇండియా సినిమా “టైగర్ నాగేశ్వర రావు” తో సిద్ధం అవుతున్నాడు.

మరి ఈ భారీ సినిమాని దర్శకుడు మహేష్ తెరకెక్కిస్తుండగా స్టువర్ట్ పురం గజదొంగ టైగర్ నాగేశ్వర రావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ భారీ సినిమా పై ఇప్పుడు మేకర్స్ బిగ్ అప్డేట్ ని అందించారు. ఈ సినిమాని అయితే ఈ ఏడాది అక్టోబర్ 20న రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు.

అయితే ఇదే 20న అయితే మరో పాన్ ఇండియా సినిమా రామ్ పోతినేని మరియు బోయపాటి శ్రీను సెన్సేషనల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా కూడా మొన్ననే అనౌన్స్ అయ్యింది. దీనితో ఒకేరోజు భారీ క్లాష్ పడగా ఇక దీనికి ముందు ఐతే అంటే అక్టోబర్ 19న కోలీవుడ్ సినిమా విజయ్ నటిస్తున్న “లియో” కూడా పాన్ ఇండియా లెవెల్లో భారీ రిలీజ్ కి సిద్ధం అవుతుంది.

దీనితో మొత్తం మూడు భారీ సినిమాలు ఇదే రేస్ లో ఉన్నాయి. మరి మాస్ మహారాజ కూడా ఇదే భారీ క్లాష్ లో అయితే రాబోతున్నాడు మరి ఈ మూడు పాన్ ఇండియా సినిమాల తాకిడి ఎలా ఉంటుందో చూడాలి. కాగా ఈ సినిమాని అయితే అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.