ఫస్ట్ లుక్ : “టైగర్ నాగేశ్వరరావు” గా మోస్ట్ పవర్ఫుల్ గా రవితేజ.!

మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియా సినిమా చిత్రం “టైగర్ నాగేశ్వరరావు” కోసం అందరికీ తెలిసిందే. కాగా ఈ మాస్ ప్రాజెక్ట్ ని కొత్త దర్శకుడు వంశీ తెరకెక్కిస్తుండగా ఈ సినిమా నిజ జీవిత మోస్ట్ పవర్ ఫుల్ వ్యక్తి టైగర్ నాగేశ్వరరావు స్టువర్ట్ పురం దొంగ జీవిత చరిత్ర ఆధారంగా అయితే మేకర్స్ తెరకెక్కించారు.

మరి ఈ భారీ చిత్రం రవితేజ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తుండగా రవితేజ ఫ్యాన్స్ కూడా చాలా ఆసక్తిగా ఈ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు. కాగా ఈ సినిమా నుంచి అయితే మేకర్స్ మోస్ట్ అవైటెడ్ గా ఉన్న ఫస్ట్ లుక్ పోస్టర్ ని అయితే మేకర్స్ ఇప్పుడు రిలీజ్ చేసారు.

తెలుగు సహా అన్ని భాషల్లో కూడా రిలీజ్ చేసిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసారు. అయితే ఈ పోస్టర్ మాత్రం మంచి మోస్ట్ పవర్ ఫుల్ గా ఉందని చెప్పాలి. రవితేజ నుంచి మోస్ట్ ఫిరోసియస్ లుక్ ని ఇందులో డిజైన్ చేయగా తన నోటిలో కత్తి ముఖంపై గాట్లు చూసినట్టు అయితే సూపర్ మాస్ గా కనిపిస్తుంది.

ఇక తెలుగులో అయితే లుక్ ని వెంకీ మామ పరిచయం చేస్తూ దీనిని రిలీజ్ చేసారు. మొత్తానికి అయితే ఈ అవైటెడ్ ఫస్ట్ లుక్ తో రవితేజ ఫ్యాన్స్ కి కావాల్సిన సాలిడ్ హైప్ వచ్చింది అని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రానికి జివి ప్రకాష్ సంగీతం అందిస్తుండగా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ వారు పాన్ ఇండియా లెవెల్లో భారీ స్థాయిలో అయితే నిర్మాణం వహిస్తున్నారు.