గ్లింప్స్ టాక్ : డిజప్పాయింట్ చేసిన రవితేజ బర్త్ డే గిఫ్ట్ “రావణాసుర”?

మాస్ మహారాజ రవితేజ హీరోగా ఏకంగా ఆరుగురు హీరోయిన్స్ తో నటిస్తున్న లేటెస్ట్ సినిమానే “రావణాసుర”. యువ దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ సినిమా రవితేజ క్రాక్ లాంటి భారీ హిట్ తర్వాత అనౌన్స్ చేసిన సినిమాల్లో ఒకటి కాగా ఈ సినిమాపై అప్పటి నుంచి కూడా మంచి ఆసక్తి అయితే నెలకొంది.

అయితే ఈ చిత్రాన్ని టైటిల్ కి తగ్గట్టుగా ఓ నెగిటివ్ షేడ్ లో ప్రెజెంట్ చేస్తూ ఉండగా ఈరోజు రవితేజ పుట్టినరోజు కానుకగా అయితే మేకర్స్ ఓ గ్లింప్స్ టీజర్ ని రిలీజ్ చేశారు. ఇక ఈ వీడియో మాత్రం ఫ్యాన్స్ ని పూర్తి స్థాయిలో థ్రిల్ చేసే విధంగా లేదని చెప్పాలి. ఓ మాదిరిగా ఓకే అని చెప్పొచ్చు.

కానీ పెద్దగా సినిమా కోసం ఏమి రివీల్ చేయలేదు దీనితో ఈ వీడియో నుంచి కాస్త ఎక్కువ ఆశించినవారికి మాత్రం డిజప్పాయింట్మెంట్ తప్పదని చెప్పొచ్చు. కాకపోతే ఇందులో కొన్ని క్రైమ్ సీన్స్ గాని రవితేజ సూపర్ స్క్రీన్ ప్రెజెన్స్ గాని సూపర్ గా కనిపిస్తున్నాయి. ఇది మినహా ఇంకా ఇందులో ఎక్కువ ఆశించక్కర్లేదు.

మరి ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా, మేఘ ఆకాష్, పూజిత పొన్నాడ, అను ఇమ్మానుయేల్ అలాగే దక్ష నగార్కర్ లు నటిస్తున్నారు. అలాగే కథ, స్క్రీన్ ప్లే మరియు డైలాగ్స్ ని శ్రీకాంత్ విస్సా అందించారు. కాగా రవితేజ తన నిర్మాణ సంస్థలో ఈ సినిమాని నిర్మాణం వహిస్తున్నారు.
Ravanasura Movie Glimpse | Mass Maharaja Ravi Teja | Sushanth | Sudheer Varma | HBD Ravi Teja