రేస్ నుంచి తప్పుకున్న రవితేజ? అంత సీన్ లేదంటున్న నిర్మాతలు 

టాలీవుడ్ మాసెస్ట్ హీరోస్ లో తన సొంత పవర్ తో ఎదిగి మంచి క్రేజ్ అండ్ మార్కెట్ ని సొంతం చేసుకున్న హీరోస్ లో మాస్ మహారాజ రవితేజ కూడా ఒకడు. మరి మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “టైగర్ నాగేశ్వరరావు” తో దసరా కానుకగా పలకరించగా ఈ చిత్రం తర్వాత వచ్చే ఏడాది అయితే సంక్రాంతి బరిలో దర్శకుడు కార్తీ ఘట్టమనేని తో చేస్తున్న భారీ చిత్రం “ఈగల్” కూడా విడుదల చేసేందుకు సిద్ధం అయ్యాడు.

సినిమా రవితేజ మాస్ స్పీడ్ తో కంప్లీట్ చేయగా ఎప్పుడో ఈ చిత్రాన్ని సంక్రాంతి రిలీజ్ కి సిద్ధం చేయగా ఇప్పుడు ఈ సినిమా సంక్రాంతి రేస్ నుంచి తప్పుకుంది అని వచ్చే ఏడాది జనవరి 26 కి అలా మారిపోయింది అంటూ కొన్ని వార్తలు వైరల్ గా మారాయి. కాగా ఈ వార్తలు రూమర్స్ పై అయితే చిత్ర నిర్మాతలు గట్టి సమాధానం ఇచ్చేసారు.

తాము వెనక్కి తగ్గేది లేదు అని మేము ముందే చెప్పాం ఖచ్చితంగా వచ్చి తీరుతాం అని కన్ఫామ్ చేశారు. వాయిదా పడింది అని అంటున్న వారు థియేటర్ అగ్రిమెంట్స్ కూడా చూసుకోవచ్చని సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో వాళ్ళకి అర్ధం అవుతుంది అని ఖరాఖండిగా చెప్పేసారు.

దీనితో రవితేజ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో డెఫినెట్ గా ఉందని ఇప్పుడు ఖరారు అయిపోయింది. ఇక ఈ సినిమాలో అనుపమ నటిస్తుండగా రవితేజ ఒక పవర్ ఫుల్ స్నైపర్ గా కనిపించనున్నాడు అలాగే రవితేజతో ఆల్రెడీ ధమాకా అనే సెన్సేషనల్ హిట్ కొట్టిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహిస్తున్నారు.