ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటున్న రవితేజ నిర్మాతలు..!

ఈ ఏడాది టాలీవుడ్ సినిమా దగ్గర సంక్రాంతి కానుకగా రిలీజ్ కి పలు చిత్రాలు రాగ ఈ చిత్రాల్లో ఎప్పుడో రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న చిత్రం “ఈగిల్” కూడా ఒకటి. కాగా ఎనర్జిటిక్ హీరో మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని డెబ్యూ దర్శకుడు కర్త్రిక్ ఘట్టమనేని తెరకెక్కించాడు.

కాగా ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ పాటలు ఆకట్టుకోగా మంచి బజ్ అప్పుడు వచ్చింది. కానీ నెలకొన్న భారీ పోటీ నిమిత్తం చిత్ర యూనిట్ చేత సినీ పెద్దలు తమకి సోలో రిలీజ్ ఇస్తామని ప్రామిస్ చేసి తమ రిలీజ్ లు చేసుకున్నారు. దీనితో అప్పుడు ఈగిల్ నిర్మాత టిజి విశ్వప్రసాద్ హీరో రవితేజ లు కూడా వెనక్కి తగ్గారు.

మరి ఇపుడు తాజాగా చిత్ర నిర్మాతలు తమకి ఇచ్చిన మాటని ఫిల్మ్ ఛాంబర్ వారికి గుర్తు చేస్తున్నారు. తమకి సోలో రిలీజ్ ఇస్తామని అప్పుడు చెప్పారు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉన్నా కూడా తమకి ఇచ్చిన మాట ప్రకారం సినిమా ఈగిల్ కి సోలో రిలీజ్ ఇవ్వాల్సిందిగా గుర్తు చేస్తున్నాము అని తెలిపారు.

దీనితో ఈ ప్రెస్ నోట్ ఒకటి సినీ వర్గాల్లో వైరల్ గా మారింది. మరి దీనిపై నిట్రమాట దిల్ రాజు ఎలాంటి స్పందన ఇస్తాడో చూడాలి. కాగా ఆల్రెడీ ఈగిల్ కోసం నాగవంశీ తెరకెక్కిస్తున్న టిల్లు స్క్వేర్ ని వాయిదా వేసుకున్నాడు. కానీ ఇంకా కొన్ని సినిమాలు ఉన్నాయి. అవి తప్పుకుంటాయో లేదో వాటిని తప్పిస్తారో లేదో అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది.