Raviteja Producer : వైరల్ : రిలీజ్ కి ముందే ఖరీదైన కార్ గిఫ్ట్ అందుకున్న రవితేజ దర్శకుడు.!

Raviteja Producer : టాలీవుడ్ సహా కోలీవుడ్ ఇండస్ట్రీ లలో అసలు ఎలాంటి యాంటీ ఫ్యాన్స్ లేని హీరోల జాబితా అంటూ తీస్తే వారిలో ఒక సూర్య, మాస్ మహారాజ్ రవితేజ అలాగే విక్టరీ వెంకటేష్, శివ కార్తికేయన్ లాంటి స్టార్ హీరోలు పేర్లు వినిపిస్తాయి. అందుకే ఈ వీరి సినిమాలు ఏ టైం లో వచ్చినా అందరి హీరోల అభిమానులు చూసేందుకు ఆసక్తి కనబరుస్తారు.

మరి అలా మాస్ మహారాజ్ రవితేజ హీరోగా చేసిన సినిమాల్లో అందాలు సమానంగా హిట్ ని ఎంజాయ్ చేసిన సినిమా “క్రాక్”. దాని తర్వాత గాడిలో పడ్డ రవితేజ వెను వెంటనే దర్శకుడు రమేష్ వర్మతో “ఖిలాడి” అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ని లాక్ చేసి షాక్ ఇచ్చాడు.

అయితే మరి ఈ డైరెక్టర్ ని ఎంత నమ్మాడో కానీ రవితేజ ఈ సినిమాని గత ఏడాది మే నెలలోనే రిలీజ్ చేసేయాలని ప్లాన్ చేసాడు. ఇక ఇప్పుడు ఈ సినిమా చివరి దశకి వస్తుండగా ఈ సినిమా నిర్మాత ఇంకా సినిమా రిలీజ్ కాకుండానే ఏకంగా కోటి రూపాయల 15 లక్షల విలువ గల ఖరీదైన రేంజరోవర్ కారుని బహుమానంగా ఇవ్వడం ఇండస్ట్రీ వర్గాల్లో వైరల్ గా మారింది.

దీనితో ఇలా ముందే ఇవ్వడం పట్ల అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమాలో డింపుల్ హయాతి మరియు మీనాక్షి చౌదరి లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అలాగే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.