Gallery

Home Entertainment క్రాక్ ట్రైలర్ ... కిరాక్ పుట్టిస్తున్న మాస్ మహారాజ్ !

క్రాక్ ట్రైలర్ … కిరాక్ పుట్టిస్తున్న మాస్ మహారాజ్ !

టాలీవుడ్ మాస్ రాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం క్రాక్. ఈ సినిమా తో ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు రవితేజ. అనీల్ రావిపూడి తెరకెక్కించిన రాజా ది గ్రేట్ సినిమా తర్వాత రవితేజ సరైన సక్సెస్ చూడలేదు. దీనితో ఈ సినిమా పైన భారీ ఆశలే పెట్టుకున్నారు రవితేజ అభిమానులు. ఇక ఈ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తుంది. అలాగే తమిళ నటుడు, దర్శకుడు సముద్రఖని మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. న్యూ ఇయర్ కానుకగా తాజాగా చిత్ర యూనిట్ క్రాక్ సినిమా ట్రైలర్ ను విడుదల చేసింది.

Ravi Teja'S Krack' Trailer On New Year

ఇందులోని సన్నివేశాలు ప్రేక్షకులకి పిచ్చెక్కిస్తున్నాయి. రవితేజ పవర్‌ఫుల్ పోలీసాఫీసర్‌గా కనిపించనున్నాడు. రవితేజ్ పవర్ ఫుల్ పర్‌ఫార్మెన్స్ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. శృతిహాసన్ గ్లామర్ కూడా సినిమాకు ప్లస్ అవుతుంది. రవితేజ-గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తోన్న మూడో చిత్రం క్రాక్ కాగా, ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో జరిగిన యథార్థ ఘటనల ఆధారంగా రూపొందుతోంది.

ఇంటెన్స్ స్టోరీతో పాటు అన్ని వర్గాలను ఆకట్టుకొనే అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయని చిత్ర యూనిట్ చెబుతోంది. సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్‌పై బి. మధు నిర్మిస్తున్నారు. ఎస్. తమన్ సంగీతం సమకూరుస్తోన్న ఈ సినిమాకు జి.కె. విష్ణు సినిమాటోగ్రఫీ అందించారు. క్రాక్’ మూవీకి విక్టరీ వెంకటేష్ వాయిస్ ఓవర్ ఇవ్వడం మరో స్పెషల్ అట్రాక్షన్‌గా చెప్పవచ్చు. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

 

- Advertisement -

Related Posts

40 రోజుల్లో రాజమౌళి నుండి విడుదల పొందనున్న చరణ్, ఎన్టీఆర్

  రాజమౌళి సినిమా అంటే చాలా ఓపిక ఉండాలి. ఆయనతో సినిమా చేయాలి అనుకుంటే కనీసం రెండేళ్లు ఆయానకు అంకితం చేయాల్సిందే ఏ హీరో అయినా. అంటే రెండేళ్ల పాటు వెండితెర మీద కనబడరనే...

ఉపాసన చేతికి అరుదైన, కీలకమైన బాధ్యతలు

  ఉపాసన కొణిదెల సామాజిక కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందు ఉంటారు. ఒకవైపు అపోలో హాస్పిటల్స్ బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరోవైపు సోషల్ రెస్పాన్సిబిలిటీస్ కూడ నిర్వర్తిస్తుంటారు. ఇటీవల కాలంలో కరోనా వ్యాక్సినేషన్ విషయంలో ప్రజల్లో అవగాహన...

‘మా’ ఎన్నికల బరిలోకి లేడీ..రసవత్తరంగా మారిన పోటీ

మా అసోసియేషన్ అధ్యక్ష పదవికి జరగనున్న ఎన్నికలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి.  ఎప్పుడో సెప్టెంబర్లో జరగబోయే ఎన్నికల వేడి ఇప్పటి నుండే ఇండస్ట్రీని తాకుతోంది. బలమైన వ్యక్తులు బరిలోకో దిగుతుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది....

Latest News