బిగ్ అప్డేట్ : టెట్రా టైం రవితేజ మాస్ కాంబినేషన్ కన్ఫర్మ్.!

టాలీవుడ్ లో ఉన్నటువంటి పలు క్రేజీ కాంబినేషన్స్ లో అయితే మాస్ మహారాజా రవితేజ అలాగే స్టార్ దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్ కూడా ఒకటి. మరి వీరి కాంబినేషన్లో ఇప్పటికే వచ్చిన మూడు చిత్రాలు హ్యాట్రిక్ భారీ హిట్స్ కాగా ఇక నాలుగోసారి ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుంది అని అయితే ఓ టాక్ బాగా వైరల్ గా ఈ కొన్ని రోజులు మారింది.

ఇక ఎట్టకేలకు ఈ వార్తలు నిజం చేస్తూ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అయితే ఈ బిగ్ అప్డేట్ ని ఇప్పుడు రివీల్ చేసారు. తమ నిర్మాణంలో రెండో సారి అలాగే వారి కాంబినేషన్ లో నాలుగో సారి ఈ చిత్రం తెరకెక్కుతున్నట్టుగా తెలపడమే కాకుండా ఈ చిత్రానికి కూడా వరుసగా నాలుగో థమన్ వర్క్ చేస్తున్నట్టుగా క్రేజీ అప్డేట్ అందించారు.

దీనితో క్రాక్ లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత అనౌన్స్ అయ్యిన ఈ చిత్రం ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ లో ఆసక్తి ఇప్పుడు నెలకొంది. మరి దీనికి ముందు దర్శకుడు గోపీచంద్ మలినేని కి వీరసింహా రెడ్డి అనే మాస్ హిట్ కూడా ఉంది. ఇలా మంచి ఫామ్ లో ఉన్న కాంబినేషన్ పై ఇపుడు అంచనాలు తార స్థాయిలో ఉన్నాయి. ఇక ఇప్పుడు రవితేజ అయితే టైగర్ నాగేశ్వర్ రావు అలాగే ఈగల్ అనే రెండు భారీ చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నారు.