రవితేజ – శృతి హాసన్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ సినిమా క్రాక్. ఈ సినిమా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకొని రిలీజ్ కి రెడీ అయింది. సంక్రాంతి కానుకగా ఈ నెల 9 న భారీ స్థాయిలో విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను తాజాగా నిర్వహించారు. గత ఏడాది మార్చ్ నెల తర్వాత మళ్ళీ సినిమా ఇండస్ట్రీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగడం రవితేజ క్రాక్ సినిమాదే కావడం విశేషం. చెప్పాలంటే గడిచిన ఈ 10 నెలలుగా ఏ సినిమాకి ఈవెంట్స్ నిర్వహించలేకపోయారు.
కాగా క్రాక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాస్ మహారాజ రవితేజ సినిమాపై చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసి అందరిలో సినిమాపై భారీ లెవల్ లో అంచనాలు పెరిగేలా చేశాడు. ఈ సినిమాకోసం దర్శకుడు గోపీచంద్ తో పాటు చిత్ర యూనిట్ లో ప్రతి ఒక్కరు ఎంతో కష్టపడ్డారని చెప్పుకొచ్చాడు. అంతేకాదు గోపీచంద్ మలినేని తో నాకు క్రాక్ హ్యాట్రిక్ సినిమా కాబోతుందని ధీమాగా మాట్లాడాడు. మళ్ళీ క్రాక్ సినిమా సక్సస్ మీట్ లో మాట్లాడుకుందామని రవితేజ అనడం అందరినీ ఉత్సాహానికి గురి చేసింది.
ఇన్నాళ్ళకి రవితేజ ఫ్యాన్స్ కి కావాల్సిన సినిమా రాబోతుందని ఈ సినిమా భారీ సక్సస్ కావడం గ్యారెంటీ రవితేజ మాటలని బట్టి అర్థమవుతోందని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నారు. ఇక రవితేజ కి రాజా ది గ్రేట్ తర్వాత మళ్ళీ సాలీడ్ హిట్ దక్కలేదు. వరసగా రవితేజ నటించిన సినిమాలన్ని బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్స్ గా మిగిలాయి. ఈ క్రమంలో క్రాక్ మీద రవితేజ భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ఇక క్రాక్ తర్వాత రవితేజ నుంచి ఖిలాడి అన్న సినిమా రాబోతోంది. ఈ సినిమాకి రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నాడు. రవితేజ డ్యూయల్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చైదరి, డింపుల్ హయాతి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.