గాసిప్స్ : రవితేజ మరోసారి ఈ యంగ్ హీరోయిన్ తోనే?

ravitejadu-du-song-from-dhamaka

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోస్ లో ఉన్నటువంటి డైనమిక్ హీరోస్ లో తమ స్వయం కృషితో పైకి వచ్చిన స్టార్ హీరోల్లో మాస్ మహారాజ రవితేజ కూడా ఒకడు. మరి రవితేజ ఇప్పుడు ఓ యావరేజ్ బడ్జెట్ సినిమాలు తీసే రేంజ్ నుంచి ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా సినిమాని షేక్ చేసే స్థాయికి అయితే వెళ్లారు.

మరి మాస్ మహారాజ్ అంటేనే మొదట గుర్తుకు వచ్చేది సూపర్ ఎనర్జీ అలాగే మంచి ఎంటర్టైన్మెంట్ కూడా. మరి తాను అలా చేసిన అన్ని చిత్రాలు కూడా మంచి హిట్ కాగా ఈ కోవలో మంచి ఎంటెర్టైమెంట్ అందిస్తూ వచ్చి భారీ హిట్ అయ్యిన చిత్రమే “ధమాకా”.

మరి ఈ చిత్రంతోనే రవితేజ భారీ కం బ్యాక్ ని అందుకోవడమే కాకుండా ఈ సినిమా హీరోయిన్ శ్రీ లీల కి కూడా పెద్ద బ్రేక్ వచ్చింది. అయితే ఈ ఇద్దరి పట్ల మొదట చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. ఇంత చిన్న ఏజ్ అమ్మాయితో రొమాన్స్ ఏంటి అని. కానీ సినిమా రిలీజ్ అయ్యాక ఇక అంతా యాక్సెప్ట్ చెయ్యక తప్పలేదు.

అయితే మళ్ళీ ఈ క్రేజీ కాంబినేషన్ రిపీట్ కాబోతున్నట్టుగా తెలుస్తుంది. కాగా ఈ కాంబినేషన్ దర్శకుడు గోపీచంద్ మలినేనితో చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే రవితేజ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో వచ్చిన మూడు సినిమాలు పెద్ద హిట్స్ కాగా ఇది నాలుగో కొలాబరేషన్ ఇప్పుడు ఇందులో హీరోయిన్ గా శ్రీలీల లాక్ అయ్యినట్టుగా అంటున్నారు అలాగే ఈ చిత్రాన్ని అయితే మేకర్స్ ఈ సెప్టెంబర్ నుంచి షూటింగ్ స్టార్ట్ చేయనున్నారట.