ఖిలాడి ఫస్ట్ గ్లింప్స్ వచ్చేసింది !

ఈ ఏడాది సంక్రాంతికి క్రాక్‌తో బ్లాక్‌బస్టర్‌ అందుకున్న మాస్‌ మహారాజ రవితేజ, రాక్షసుడుతో బ్లాక్‌బస్టర్‌ సాధించిన దర్శకుడు రమేశ్‌ వర్మ పెన్మత్స కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం ‘ఖిలాఢి’. ఏ స్టూడియోస్‌, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై జయంతి లాల్‌ గడ సమర్పణలో సత్యనారాయణ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

రవితేజ బర్త్ డే గిఫ్ట్ వచ్చేసింది.. 'ఖిలాడి' ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్.. నయా లుక్‏లో అదరగొడుతున్న మాస్ రాజా..

రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఖిలాఢి సినిమా ఫస్ట్‌ గ్లింప్స్‌ను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. స్టైలిష్‌ లుక్‌ లో రవితేజ పెద్ద సుత్తి పట్టుకుని నడుస్తున్నట్లు గ్లింప్స్‌ వీడియోలో ఉంది. ఇందులో రవితేజ డ్యూయోల్ రోల్‏లో నటించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్‏కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో రవితేజకు జోడిగా మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తుండగా సుజిత్‌ వాసుదేవ్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇక సమ్మర్‏లో ఈ సినిమా విడుదల చేసేందుకు చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తుంది. ‘క్రాక్’ సినిమాతో సూపర్ హిట్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు మాస్ మాహారాజా రవితేజ. ఇక అదే జోరుతో తన తదుపరి సినిమాలను కూడా వీలైనంత తొందరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడు మాస్ రాజా.

#Khiladi Movie First Glimpse | Raviteja, Meenakshi Chaudhary | Dimple Hayathi |  Ramesh Varma | DSP