Raviteja : రవితేజ అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో…!

Raviteja : మాస్ రాజా అనగానే megastar తర్వాత కష్టపడి ఇండస్ట్రీ కి వచ్చిన హీరో అనేస్తాం. ఇక ఎంతోమంది పరిశ్రమకు వచ్చే వారికి ఆయన స్ఫూర్తి. మాస్ రాజా ఇండస్ట్రీకి రాగానే హీరో అయిపోలేదు. చిన్న పాత్రాలు చేసుకుంటూ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ పైకి ఎదిగాడు. ఎపుడు మాస్ రాజాగా మారాడు. ఒక్కోమెట్టు ఎక్కుతూ టాప్ హీరో రేంజ్ కి వచ్చిన రవితేజ ఇప్పుడోకా సంచలనం నిర్ణయం తీసుకుని అభిమానులకు షాక్ ఇచ్చాడు.

ప్రస్తుతం రవితేజ రామారావు ఆన్ డ్యూటీ సినిమా విడుదల కోసం వెయిట్ చేస్తున్నారు. దీన్ని తర్వాత రావణాసుర అనే సినిమా కూడా ప్రారంభించారు. ఇక టైగర్ నాగేశ్వర్రావు అనే పీరియడిక్ డ్రామాలో కూడా నటిస్తున్నారు. ఎలా వరుస సినిమాలతో బిజీ గా ఉన్నా రవితేజ అనూహ్యంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. అదే ఇకపై కథ నచ్చితే వేరే హీరో సినిమాలో సైడ్ క్యారెక్టర్ చేయడానికి సిద్ధం అని ప్రకటించారు. హీరోగానే కాకుండా ఇతర హీరోల సినిమాలలో కీలక పాత్రలు చేయడానికి ఓకే అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడట రవితేజ ఎపుడు ఫిల్మ్ నగర్ లో ఈ న్యూస్ వైరల్ అయింది.

ప్రస్తుతం రవితేజ మెగాస్టార్ తో కలిసి ఒక సినిమాలో నటిస్తున్నారు. ఇక బాలకృష్ణ, అనిల్ రావిపూడి దర్శకత్వం లో ఒక సినిమాలో కూడా చేయబోతున్నాడనే టాక్ వినిపిస్తోంది. ఇక తమిళ హీరో విష్ణు విశాల్ తో కలిసి ద్విభాషా చిత్రం చేయబోతున్నారు రవితేజ. ఇపుడు రవితేజ నిర్ణయం టాలీవుడ్ లో ఏమి మార్పులను తెస్తుందో చూడాలి.