ప్చ్..మరోసారి ఒంటరి వాడైపోయిన రవితేజ?

తెలుగు సినిమా దగ్గర తమ స్వశక్తితో టాలీవుడ్ లో మంచి స్టార్డం తెచ్చుకున్న హీరోస్ చాలా కొద్ది మంది ఉంటే ఆ లిస్ట్ లో మాస్ మహారాజ రవితేజ కూడా ఒకరు. మరి రవితేజ హీరోగా ఇపుడు పలు సినిమాలు చేస్తున్నాడు. కానీ తనకి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ కానీ ఫామిలీ సపోర్ట్ లేకుండా టాలీవుడ్ లో ఇక్కడ వరకు నెగ్గుకు వచ్చాడు.

ఈ విషయంలో రవితేజ ని ఇష్టపడేవాళ్లు చాలా మంది ఉంటారు. అయితే రవితేజ విషయంలో మాత్రం టాలీవుడ్ లో కొన్ని పరిస్థితులు చూస్తే అన్యాయం జరిగినట్టే అనిపిస్తుంది. తన గత చిత్రాల్లో కొన్నింటి రిలీజ్ ల విషయాల్లో కానీ కొన్ని సినిమాల కోసం తన సినిమా థియేటర్స్ తగ్గించడం లాంటివి కూడా తనని ఇష్టపడేవాళ్ళని బాధించాయి.

ఇప్పుడు మళ్ళీ రవితేజ సినిమా విషయంలో అదే జరిగింది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా టాలీవుడ్ నుంచి పలు చిత్రాలు ఉంటే వాటిలో అన్ని సినిమాలు ఆల్ మోస్ట్ మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న బ్యానర్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ సపోర్ట్ ఉన్నవే ఉన్నాయి. కానీ రవితేజ “ఈగిల్” రిలీజ్ ని ఇప్పుడు తొక్కేశారు.

సంక్రాంతి రేస్ లో ఎలాగైనా సినిమాని తప్పించి మరో నెలకి ఇప్పుడు మార్పించినట్టుగా వార్తలు ఖరారు అయ్యాయి. దిల్ రాజు అండ్ కో మాట్లాడుకొని ఈగిల్ సినిమాకే ఎసరు పెట్టారు. దీనితో ఫిబ్రవరి నెలకి ఈ చిత్రాన్ని షిఫ్ట్ చేయించారు. దీనితో ఏ సపోర్ట్ లేకుండా ఉండే హీరోస్ కి ఇలానే చేస్తారా అంటూ మా హీరోని ఒంటరివాడిని చేసేశారని రవితేజ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో బాధ పడుతున్నారు.