మాస్ మహారాజ్ “ఈగిల్” టీజర్ కి ముహూర్తం ఖరారు..!

టాలీవుడ్ సినిమా మోస్ట్ ఎనర్జెటిక్ హీరోస్ లో ఒకరైన మాస్ మహారాజ రవితేజ హీరోగా ఇప్పుడు పలు భారీ సినిమాలు చేస్తుండగా ఈ చిత్రాల్లో ఎక్కువ కొత్త దర్శకులకే అవకాశం ఇస్తూ వస్తున్నాడు. అలా ఇచ్చి చేసిన లేటెస్ట్ చిత్రాలే “టైగర్ నాగేశ్వరరావు” కాగా ఈ చిత్రాన్ని వంశీ అనే దర్శకుడు చేశారు.

మరి ఈ చిత్రం అనంతరం రవితేజ చేస్తున్న మరో బిగ్ ప్రాజెక్ట్ నే “ఈగిల్”. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఈ చిత్రానికి వర్క్ చేస్తుండగా అనుపమ పరమేశ్వరన్ మరియు కావ్య థాపర్ లు అయితే హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మరి ఈ సినిమా నుంచి మేకర్స్ నిన్ననే ఓ బిగ్ అప్డేట్ టీజర్ పై అందించగా అందులో ఈరోజు అయితే అది ఎపుడు అనేది రివీల్ చేస్తామని చెప్పారు.

మరి ఇప్పుడు ఈ అప్డేట్ రివీల్ చేయగా దీనితో అయితే రేపు నవంబర్  6న టీజర్ విడుదల చేస్తున్నట్టుగా టైం కూడా ఫిక్స్ చేశారు. రేపు ఉదయం 10 గంటల 44 నిమిషాలకి విడుదల చేస్తున్నట్టుగా ముహూర్తం ఖరారు చేశారు. దీనితో ఈ టీజర్ ఎలా ఉంటుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

ఇక ఈ చిత్రాన్ని అయితే వచ్చే ఏడాది జనవరి 13న ఎట్టి పరిస్థితుల్లో థియేటర్లు లో దింపాలని మేకర్స్ చూస్తుండగా అప్పటీకే భారీ పోటీ ఉన్నప్పటికీ వెనక్కి తగ్గే సూచనలు లేవని క్లియర్ గా చెప్తున్నారు. 
https://x.com/UrsVamsiShekar/status/1721034844237631558?s=20