మరో మల్టీస్టారర్‌కి రవితేజ గ్రీన్ సిగ్నల్.?

మాస్ మహరాజ్ రవితేజ హీరోగా ‘ధమాకా’ తదితర సినిమాలు సెట్స్ మీద వున్నాయ్. ఇవి కాకుండా, ‘వాల్తేరు వీర్రాజు’ సినిమాలోనూ రవితేజ ఓ స్పెషల్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. ఇంకోపక్క, రవితేజ నిర్మాతగానూ బిజీ అవుతున్నాడు. ‘మట్టి కుస్తీ’ సినిమాని తెలుగులో రవితేజ నిర్మించిన సంగతి తెలిసిందే.

ఇదిలా వుంటే, రవితేజ మరో మల్టీస్టారర్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. రవితేజతో గతంలో కలిసి పని చేసిన ఓ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ చెప్పిన కథకి మాస్ మహరాజ్ ఫిదా అయిపోయాడట.

నిజానికి, ఈ ప్రాజెక్టు గతంలోనే సెట్ అవ్వాల్సి వున్నా, కొన్ని కారణాల వల్ల ఆలస్యమయ్యిందని అంటున్నారు. ప్రస్తుతం మల్టీస్టారర్ల ట్రెండ్ నడుస్తున్న దరిమిలా, రవితేజ కూడా రూటు మార్చినట్లు తెలుస్తోంది.

అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, సంక్రాంతి తర్వాత ఈ కొత్త ప్రాజెక్టుపై స్పష్టత వచ్చే అవకాశం వుంది. రవితేజ సిద్ధంగానే వున్నా, ఆ మల్టీస్టారర్‌లో నటించడానికి, ఇంకో హీరో కుదరకపోవడం వల్లే ఆలస్యమని సమాచారం.