ఇప్పటికీ తనతో అలా ఉండటానికి ఇష్టపడతాను మాజీ ప్రియుడి గురించి రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు..!

ఛలో సినిమా ద్వారా హీరోయిన్ గా టాలీవుడ్ లో అడుగుపెట్టిన రష్మిక ఆ సినిమా ద్వారా నటిగా మంచి గుర్తింపు పొందింది. ఆ తర్వాత తెలుగులో స్టార్ హీరోల సరసన వరుస అవకాశాలు నక్కించుకుంటూ వరుస విజయాలు అందుకుంది. ఇలా తెలుగు,తమిళ, కన్నడ భాషలలో ఎన్నో సినిమాలలో నటించి తన అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న రష్మిక నేషనల్ క్రష్ గా గుర్తింపు పొందింది. ఇక ఇటీవల విడుదలైన పుష్ప సినిమాలో అల్లు అర్జున్ సరసన నటించిన రష్మిక ఈ సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో హీరోయిన్ గా గుర్తింపు పొందింది.

ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక సినిమా విశేషాలతో పాటు తన వ్యక్తిగత విషయాల గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలో తన మాజీ ప్రియుడు గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. గతంలో రక్షిత్ శెట్టి అనే కన్నడ నటుడితో ఎంగేజ్మెంట్ చేసుకున్న రష్మిక ఆ ఎంగేజ్మెంట్ ని రద్దు చేసుకుంది. ఇటీవల పాల్గొన్న ఇంటర్వ్యూలో తన మాజీ ప్రియుడి గురించి ప్రస్తావన రాగా రష్మిక స్పందిస్తూ ఇప్పటికీ తన మాజీ ప్రియుడిని అతని కుటుంబ సభ్యులతో కలవటానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పుకొచ్చింది.

మాజీ ప్రియుడితో స్నేహంగా ఉండటం మంచిది కాదని తెలుసు. కానీ నేను ఎవరికీ శత్రువుగా ఉండాలని కోరుకోవటం లేదు అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాకుండా గీతగోవిందం, డియర్ కామ్రేడ్ వంటి సినిమాలలో విజయ్ దేవరకొండ సరసన నటించిన రష్మిక అతనితో డేటింగ్ లో ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ వార్తల గురించి ప్రస్తావన రాగా.. వినటానికి చాలా క్యూట్ గా ఉంది అంటూ రష్మిక సమాధానం చెప్పింది. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.