నోరు జారిన రష్మిక.. తర్వాత సారీ చెప్పిందనుకోండి!

సాధారణ ప్రజలు ఏదైనా పొరపాటు చేస్తే పెద్దగా సమస్య ఉండదు కానీ సెలబ్రిటీలు, వీఐపీలు, రాజకీయ నాయకులు ఏం మాట్లాడినా ఆచి తూచి మాట్లాడవలసి ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు ఎవరు తప్పు మాట్లాడితే దాన్ని ట్రోల్ చేద్దామా అని చేస్తూ ఉంటారు ఎదుటివారు. చాలామంది సెలబ్రిటీస్ మీడియా ముందు నోరు జారి అనేకసార్లు విమర్శల పాలైన సంగతి అందరికీ తెలిసిందే.

ఇప్పుడు నేషనల్ క్రష్ రష్మిక కూడా అదే సిచువేషన్ ఫేస్ చేస్తుంది. ఒక సినిమా పేరు బదులు మరొక సినిమా పేరు చెప్పి ఇరుక్కుపోయింది. ఇంకేముంది ఆమెపై ట్రోలింగ్స్ దాడి ప్రారంభమైంది. వెంటనే రష్మిక సోషల్ మీడియా లో సారీ చెప్పింది. అసలు ఏం జరిగిందంటే రష్మిక ఈ మధ్య ఈ ఒక్క ఇంటర్వ్యూ ఇచ్చింది. మామూలుగానే రష్మిక విజయ్ ఫ్యాన్ ఆ విషయం అవకాశం దొరికినప్పుడల్లా చెప్తూ ఉంటుంది.

ఈ ఇంటర్వ్యూలో కూడా విజయ్ గురించి చెప్తూ ఆయనకి నేను వీర అభిమానిని నేను పెద్ద స్క్రీన్ పై ధియేటర్లో మొదటి చూసిన సినిమా ఆయనదే, ఆయన నటించిన గిల్లి సినిమాను మొదటిసారి థియేటర్లో చూశాను. నాకు ఇటీవలో తెలిసింది ఏంటంటే అది పోకిరి సినిమాకు రీమేక్ అని. అప్పట్లో ఈ విషయం నాకు తెలియదు అని చెప్పుకొచ్చింది రష్మిక. అయితే గిల్లి సినిమా పోకిరి సినిమాకి రీమేక్ కాదు.

మహేష్ బాబు హీరోగా నటించిన ఒక్కడు సినిమాకి రీమేక్. అయితే ఇంటర్వ్యూలో రష్మిక అంత కాన్ఫిడెంట్గా తప్పు సమాధానం చెప్పడంతో ఒక్కసారిగా తనని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు నెటిజన్స్. అయితే వెంటనే అలర్ట్ అయిన రష్మిక ఈ ట్రోల్స్ పై స్పందిస్తూ ముందుగా తప్పు సమాధానం చెప్పినందుకు సారీ, ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అనుకున్నాను అరే గిల్లి అంటే ఒక్కడు రా, పోకిరి అంటే తమిళంలో కూడా పోకిరి యే అని చెప్పింది. ఈ సోషల్ మీడియా వల్ల ఏదైనా వెంటనే వైరల్ అయిపోతుంది అంటూ సరదా ఎమోజిస్ షేర్ చేసింది.