రష్మిక కంటతడి పెట్టుకున్నది నిజమే అయితే.!

ఇపుడు సౌత్ ఇండియా సినిమా దగ్గర మంచి ఆఫర్స్ తో ఫుల్ బిజీగా ఉన్న హీరోయిన్స్ లో నేషనల్ క్రష్ రష్మిక మందన్న కూడా ఒకామె కాగా ఇప్పుడు పుష్ప 2 సహా పలు భారీ చిత్రాల్లో అయితే రష్మిక ఇప్పుడు నటిస్తుంది. అయితే రష్మిక మందన్నా పై లేటెస్ట్ గా కొన్ని వీడియోలు అయితే వైరల్ గా మారాయి.

ఈ శుక్రవారం థియేటర్స్ లో రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రం “బేబీ” చిత్రాన్ని పలువురు సెలెబ్స్ తో పాటుగా రష్మికా కూడా స్పెషల్ ప్రీమియర్ ని అయితే చూసింది. మరి ఈ షో చూసి బయటకి వచ్చాక అయితే రష్మిక ఏడుస్తూ కనిపించిన విజువల్స్ వైరల్ గా మారాయి. అయితే ఆ వీడియోలో ఆమె ఏడ్చింది అని క్లియర్ కూడా గమనిస్తే తప్ప తెలియదు.

మరి ఆ రేంజ్ లో అయితే రష్మిక “బేబీ” సినిమా చూసి ఎమోషనల్ అయ్యింది. అయితే ఇది నిజమా కాదా అని ఫ్యాన్స్ అనుకుంటున్నా సమయంలో అది నిజమే అని క్లియర్ చేసింది రష్మిక. తాను బేబీ సినిమా చూసి కంటతడి పెట్టుకున్నాను అని సినిమా నాకు చాలా నచ్చింది నటీనటుల పెర్ఫామెన్స్ లు సినిమా చాలా కాలం పాటుగా హృదయాల్లో నిలిచిపోతుంది అని ఆమె తన స్పందనను తెలియజేసింది.

దీనితో రష్మిక నిజంగానే ఏడ్చింది అని అర్ధం అయ్యింది. ఇక ఈ చిత్రంలో తన కో స్టార్ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించగా వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించింది. అలాగే సాయి రాజేష్ దర్శకత్వం వహించగా ఎస్ కె ఎన్ నిర్మాణం వహించాడు.