సినిమా ప్రమోషన్ల కోసం ఫ్యామిలీని కూడా వదలని రష్మిక

రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలో నటించిన గుడ్ బై సినిమా అక్టోబర్ 7వ తేదీ విడుదల కానుంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా రష్మిక ఇప్పటికే ఎన్నో ఇంటర్వ్యూలకు హాజరై భారీగా సినిమాపై అంచనాలను పెంచారు. రష్మిక తన ఫ్యామిలీ ఫోటో ని షేర్ చేశారు.

తన తల్లిదండ్రులతోపాటు తన బుల్లి చెల్లితో కలిసి దిగిన ఫోటోను ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ రియల్ ఫ్యామిలీ అంటూ క్యాప్షన్ పెట్టారు.తన ఫ్యామిలీ ఫోటో ని షేర్ చేస్తూనే మరో రెండు రోజులలో నా రీల్ ఫ్యామిలీని కూడా చూస్తారు అంటూ గుడ్ బై సినిమా గురించి చెప్పుకొచ్చారు. ఈ విధంగా రష్మిక షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ గా మారింది. ఈ ఫ్యామిలీ ఫోటో చూసినటువంటి అభిమానులు క్యూట్ ఫ్యామిలీ అంటూ కామెంట్లు చేయగా మరికొందరు మాత్రం సినిమా ప్రమోషన్లకు ఫ్యామిలీని కూడా వదలలేదా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ప్రస్తుతం రష్మిక షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక గుడ్ బై సినిమాలో భాగంగా రష్మిక బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కూతురి పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తన మొదటి సినిమానే ఇలాంటి బిగ్ స్టార్ తో కలిసి నటించే అవకాశం రావడంతో రష్మిక ఎంతో సంతోషం వ్యక్తం చేస్తుంది. ఇక ఈమె నటించిన మొదటి హిందీ సినిమా కావడంతో ఈ సినిమాపై రష్మిక ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు మరి ఈమె అంచనాలను ఈ సినిమా చేరుతుందో లేదో వేచి చూడాలి.