Rashmika mandana : అఫ్రిన్ గా రష్మిక… దుల్కన్ సల్మాన్ తో చిత్రం ఫస్ట్ లుక్ తో ఇంప్రెస్స్ చేసిన శ్రీవల్లి…!

Rashmika Mandana:రష్మిక మందన ఇప్పుడు నేషనల్ క్రష్ గా బాగా పాపులర్. ఈ కన్నడ ముద్దు గుమ్మా ఛలో సినిమా తో నాగశౌర్యా సరసన నటించి ఈ సినిమా విజయం తో వెను తిరిగి చూసుకునే పనిలేకుండా అయింది. తర్వాత విజయ్ దేవరకొండ తో గీతాగోవిందం సినిమా తో నటనకు మంచి మార్కులే తెచ్చుకుంది. తర్వాత వచ్చిన సరిలేరు నీకెవ్వరు, భీష్మ సినిమాలతో టాప్ హీరోయిన్ అయిపోయింది.రీసెంట్ గా వచ్చిన పుష్ప తో ఆల్ ఇండియా లెవెల్ లో ఫ్యాన్ డమ్ పెంచుకుంది. ప్రస్తుతం రష్మిక బాలీవుడ్ సినిమాలలో కూడా బిజీగా ఉంది.

తాజాగా రష్మిక దుల్కర్ సల్మాన్‌ హీరో గా ఒక సినిమా చేస్తోంది.హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ హీరోగా నటిస్తున్న సినిమాలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తుంది. మంగళవారం ఈమె పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు.ఈ సినిమా ను విజయంతి మూవీ బ్యానర్స్ లో స్వప్న దత్ నిర్మిస్తున్నారు.ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రష్మిక కాశ్మీర్ ముస్లిం అమ్మాయిగా అఫ్రిన్ పాత్రలో కనిపించనుంది. తాజాగా విడుదలైన ఈమె లుక్ ఆకట్టుకుంటుంది. దుల్కర్ ఈ చిత్రంలో లెఫ్టినెంట్ రామ్ పాత్రలో నటించనున్నాడు

ఈ చిత్రంలో మృనల్ థాకూర్ మరో హీరోయిన్‌గా నటిస్తుంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు.ఇది కాకుండా రష్మిక ప్రస్తుతం రణబీర్ కపూర్ తో బాలివుడ్ లో ఒక సినిమా చేస్తోంది. పుష్ప ఇమేజ్ తో రష్మిక బాలీవుడ్ టాలీవుడ్ లో వరుస ఆఫర్ల తో దూసుకుపోతోంది