‎Anupama Parameswaran: సరికొత్త లుక్ లో కనిపించి షాకిచ్చిన అనుపమ.. సన్నగా మారి అలా!

‎Anupama Parameswaran: టాలీవుడ్ ప్రముఖ స్టార్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అనుపమ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కాగా మొన్నటి వరకు గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ వచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు గ్లామర్ పాత్రలకు సైతం సై అంటోంది. ఇకపోతే అనుపమ పరమేశ్వరన్ ఈ మధ్యకాలంలో నటించిన సినిమాలు అన్ని వరుసగా సూపర్ హిట్ గా నిలుస్తున్నాయి.

‎దాంతో ఈ ముద్దుగుమ్మకు వరుసగా అవకాశాలు వచ్చి చేరుతున్నారు. ఇది ఇలా ఉంటే అనుపమ నటించిన లేటెస్ట్ మూవీ కిష్కిందపురి. ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తి అయ్యింది. ఇది ఇలా ఉంటే తాజాగా తాజాగా కిష్కింధపురి ట్రైలర్ ను విడుదల చేసారు మూవీ మేకర్స్. అయితే ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొంది హీరోయిన్ అనుపమ.

‎ఈ ఈవెంట్లో అనుపమ ఇలా చీరకట్టులో కొత్త హెయిర్ స్టైల్ తో కనిపించి అలరించింది. సరికొత్త లుక్ లో కనిపించి షాక్ ఇచ్చింది. ఇదివరకు కాస్త బొద్దుగా చాలా అందంగా ఉన్న అనుపమ ఈ ఫోటోలలో చాలా సన్నగా మారిపోయి కాస్త బక్క చిక్కిపోయినట్టు కనిపిస్తోంది. దానికి తోడు కొత్త హెయిర్ స్టైల్ కావడంతో ఆమె మరింత స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. అయితే ఆమె లేటెస్ట్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కొంతమంది అనుపమ ఇంతకముందు బాగుంది. ఇప్పుడు కాస్త సన్నగా మారిపోయింది. ఇదివరకు లుక్ బాగుంది. ఈ లుక్ బాగాలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రెడ్ కలర్ సారిలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది అనుపమ.