వైరల్ : అది కామసూత్రలో భాగం అంటున్న రష్మీ 

rashmi

తెలుగు బుల్లితెర దగ్గర మంచి పాపులర్ అయినటువంటి యాంకర్ అండ్ యాక్ట్రెస్ లో రష్మీ గౌతమ్ కూడా ఒకామె. అయితే రష్మీ పలు సినిమాలు సహా షోస్ లో ఇప్పుడు బిజీగా ఉండగా రీసెంట్ గా “బాయ్స్ హాస్టల్” సినిమాలో కనిపించి తన గ్లామర్ తో అదరగొట్టింది.

అయ్యితే రష్మీ గౌతమ్ సోషల్ మీడియాలో కూడా బాగానే యాక్టీవ్ గా ఉంటుంది పైగా ఎక్కువ ఏదొక ఇష్యూ పై కామెంట్స్ చేస్తూ దానికి రిప్లై ఇస్తూనే కనిపిస్తుంది. మరి ఇప్పుడు కూడా అలానే తన ట్విట్టర్ వేదికగా పలు ఇంట్రెస్టింగ్ అండ్ ఊహించని రిప్లై లు అయితే ఇచ్చింది. తాను హిందూ సంప్రదాయాలను బాగా ఫాలో అవుతుంది అని తెలిసిందే.

అయితే రీసెంట్ గా స్టార్ట్ అయ్యిన సనాతన ధర్మం కాంట్రవర్సీ పైనే ఈమె మాట్లాడుతూ ఓ నెటిజన్ తో వాగ్వాదంలో ఉంది. మరి సనాతన ధర్మంలో ఎక్కడా హిందూ మతంలో అమ్మాయిలు స్కిన్ షో చేసినట్టు లేదని మరి దానిని ఫాలో అయ్యే నువ్వు ఎందుకు స్కిన్ షో చేస్తున్నావు అని రష్మీ పిక్ ని అయితే పెట్టి ప్రశ్నించగా.

దానిని రష్మీ ఇచ్చిన సమాధానం వైరల్ గా మారింది. కాగా రష్మీ మాట్లాడుతూ ఇదంతా కామసూత్రలో ఒక భాగం ఈ కామ సూత్రం కూడా సనాతన ధర్మంలో భాగమే అని ఒక్కసారి చరిత్ర చూస్తే ఒకానొకప్పుడు హిందూ స్త్రీలు ఎలాంటి వేషధారణలో ఉండేవారో తెలుస్తుంది.

కానీ ఇప్పుడు ఎందుకో అందరికీ మా వేషధారణలే ఇబ్బందిగా అనిపిస్తున్నాయి. ఇప్పుడు మగవారి వల్ల మేము ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏంటి అని ఎవరికీ తెలీదు. వీటికి హిందూ మతంతో గాని సనాతన ధర్మంతో గాని ఎలాంటి సంబంధం లేదు అని చెప్పుకొచ్చింది. దీనితో ఈ రిప్లై ఇప్పుడు వైరల్ గా మారింది.