అత్యాచారాలకు సంబంధించిన వార్తలు చూడని, చదవని రోజంటూ ఉండదు. మరీ రాను రాను పరిస్థితి దారుణంగా తయారవుతోంది. చిన్న పిల్లలపైనా అత్యాచారాలు చేస్తున్నారు. పసి కందులు అని చూడకుండా చిన్న పిల్లలపైనా అఘాయిత్యానికి పాల్పడుతున్నారు. అయితే ఏది అత్యాచారం, ఏది అసభ్య ప్రవర్తన, ఏది మంచి ప్రవర్తన అనేది చిన్నతనం నుంచి పిల్లలకు నేర్పించాలని, సెక్స్ ఎడ్యుకేషన్‌పై అవగాహన కల్పించాలని చిన్మయి శ్రీ పాద ఎప్పటినుంచో కోరుతోంది.
చిన్న పిల్లలకు బంధువుల నుంచి ఏర్పడే సమస్యలు, రాక్షసంగా ప్రవర్తన గురించి వాళ్లకు తెలీదు. కొంత మంది పిల్లలు కొంత మంది దగ్గరకు వెళ్లరు. కొంత మంది ప్రేమతోనో మరి ఇంకేదైనా ఆలోచనలతోనో ముద్దాడేందుకు ప్రయత్నిస్తారు. కానీ కొంత మంది పిల్లలు మాత్రం దగ్గరకు వెళ్లరు. అయితే తల్లిదండ్రులు మాత్రం వెళ్లమని బలవంతం చేస్తారు. అలాంటి ఘటనలపై ముందుగా పేరేంట్స్‌కు అవగాహన కల్పించాలని చిన్మయి ఎప్పటి నుంచో పోరాడుతోంది.
తాజాగా ఇదే విషయంపై స్పందిస్తూ.. మీరు మీ పిల్లలను అలా బలవంతం చేస్తే అది కామన్ ఏమో అని వారి మనసులో స్థిరపడుతుంది.. అందుకే మీరు మీ పిల్లలను వారి దగ్గరకు వెళ్లండి వీళ్ల దగ్గరకు వెళ్లండి.. ముద్దు పెట్టుకోనివ్వండి వంటి ఆదేశాలు ఇవ్వకండి చిన్మయి సూచించింది. ఆ విషయంలో పిల్లలనే తమ నిర్ణయాన్ని తీసుకునే స్వేచ్చ కలిగించాలని చెప్పుకొచ్చింది. ఇలా చిన్మయి చేసిన పోస్ట్ రష్మి స్పందించింది. అది వంద శాతం కరెక్ట్.. అంటూ తన భావాలు, ఆలోచనలు కూడా అవే అంటూ రష్మీ చెప్పకనే చెప్పింది.