లైంగికంగా కలవమని బలవంత పెట్టకండి.. రష్మీ ఆవేదన

జబర్దస్త్ వేదిక మీద మెరిసిన అందం రష్మీ గౌతమ్. అంతకు ముందు ఎప్పటి నుంచి వెండితెరపై చిన్నా చితకా సినిమాలను చేస్తూ వచ్చినా రష్మికి ఎలాంటి గుర్తింపు దక్కలేదు. ఇక అనసూయ మధ్యలో కాస్త గ్యాప్ ఇచ్చే సరికి రష్మీకి లక్ కలిసి వచ్చింది. రష్మీ తన గ్లామర్, అందంతో జబర్దస్త్ ముందుకు లాక్కొచ్చింది. ఇక సుడిగాలి సుధీర్ రష్మీ ట్రాక్ గత ఏడేళ్లుగా నడుస్తూనే ఉందన్న సంగతి తెలిసిందే.

Rashmi Gautam Opposes Illegal Breeding Of Dog

బుల్లితెరపై ఈ జంట ఎంతటి సంచలనాలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. వీరిద్దరిపై వచ్చిన రూమర్లు మరేతర ఆర్టిస్ట్‌లపై వచ్చి ఉండవు. అయితే తెరపై మాత్రమే రష్మీ అలా ఉంటుంది. రియల్ లైఫ్‌లో రష్మీ జీవించే విధానం వేరు. ఇళ్లు, అమ్మ, తన పెంపుడు జంతువులు ఇదే లోకంగా బతుకుతుంది. రష్మీ జంతు ప్రేమికురాలన్న సంగతి ఆమె అభిమానులందరికీ తెలిసిందే. ఎక్కడైనా ఏ పెట్‌కైనా సాయం కావాలంటే వెంటనే రియాక్ట్ అవుతుంది.

Rashmi Gautam Opposes Illegal Breeding Of Dog

లాక్‌డౌన్‌లోనూ, అంతటి క్లిష్ట పరిస్థితిలోనూ రష్మీ వీధి కుక్కల కోసం నిలబడింది. ఆహారం దొరక్కా అల్లాడిపోతోన్న వీధి కుక్కలకు స్వయంగా రోడ్డెక్కి మరీ తినిపించింది. పెట్స్ ఆర్గనైజేషన్‌తో కలిసి యాక్టివ్‌గా ఉంటూ కుక్కలకు ఉండే సమస్యలను పరిష్కరిస్తుంది. తాజాగా కుక్కల ఉత్పత్తి కోసం వాటిని బలవంతంగా లైంగికంగా బలవంత పెడుతుండటంపై గళమెత్తింది. అది చట్టరిత్యానేరమని అలా చేయకండని హెచ్చరించింది.