Rashi Khanna : సినీ పరిశ్రమలో తారల జీవితాలు పైకి కనిపించినంత అందంగా లోపల ఉండవు. ముఖ్యంగా నటీమణులు వారు ఎదుర్కునే సమస్యలను చాలా మంది వారిలో బయటపెట్టడానికి సాహసించరు. వాళ్ల కెరీర్ ను దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఎదుర్కొన్న ఇబ్బందులను చెప్పారు. అయితే కొంత మంది హీరోయిన్లు క్యారెక్టర్ ఆర్టిస్ట్లు మాత్రం వారు వ్యక్తిగతంగా ఇండస్ట్రీ లో పడ్డ ఇబ్బందులను సామాజిక మధ్యమాల వేదికగా చెప్తున్నారు. మీ టూ ఉద్యమం ఊపందుకున్నాక కేవలం సినిమా రంగంలోనే కాకుండా అన్ని రంగాలలోని ఆడవాళ్లు వారి కెరీర్ లో ఎదుర్కొన్న వేధింపులను సోషల్ మీడియా వేదిక గా చెబుతున్నారు.
ఇటీవలే తెలుగులో టాప్ హీరోయిన్ గా ఉన్న రాశి ఖన్నా తన విషయం లో ఎదుర్కొన్న అవమానాలను సోషల్ మీడియా వేదిక గా చెప్పి అందరిని షాక్ కు గురిచేసింది. తెలుగు చిత్ర పరిశ్రమలో తొలి రోజుల్లో తనను గ్యాస్ ట్యాంకర్ అంటూ బాడీ షేమింగ్ చేసారని చెప్పింది.సౌత్ పరిశ్రమలో కెరీర్ మొదట్లో తనకు మంచి పాత్రలే వచ్చిన సినిమాల్లో తను లావుగా ఉండటం వల్ల ఎలాంటి పాత్రలే వచ్చాయని వివరించింది. ఇక తాను ఏనాడు తనని గ్యాస్ ట్యాంకర్ అన్నకూడా బాధపడలేదని తన ఫిటినెస్ కోసం బాగానే కష్టపడ్డానని చెబుతూ ఎవరికోసమో సన్నబడలేదని తనకోసం ఫిటినెస్ పెంచుకున్నానని తనకు జరిగిన చేదునుభావాలను పంచుకుంది సదరు ఇంటర్వ్యూ లో.
ఇక రాశిఖన్నా హిందీ,మలయాళం, తెలుగు, తమిళ సినిమాలతో బిజీ గా ఉంది. గోపీచంద్ సరసన పక్కా కమర్షియల్ సినిమాలో నటించింది. విడుదలకు సిద్ధమైన ఈ సినిమా లో రెండో సారి గోపీచంద్ తో జతకట్టింది.ఇక అజయ్ దేవగన్ రుద్ర లో మెరిసింది రాశి.ఇక తమిళంలో కార్తీ సరసన సర్దార్ సినిమాలో నటిస్తోంది.